జీవితంలో ఎన్నో ఎత్తు పల్లాలు ఎదురుకావటం సహజం.. వీటిలో కొన్ని సార్లు జయాపజయాలు ఉంటాయి. విజయాలకు పొంగిపోకుండా.. అపజయాలకు లొంగిపోకుండా... తరచూ మొక్కవోని ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్తే ఉన్నత శిఖరాలకు చేరుకోవచ్చన్నది జగమెరిగిన సత్యం.
ఇలాంటి ఆశయాలను మనం మాత్రమే కాదు మన లాగే అందరూ సాధించాలని భావిస్తే అది మహోన్నత ఆశయం అవుతుంది. ప్రతి మనిషికి ఆదర్శం అవుతుంది. దీనికి చెయ్యాల్సిందల్లా మీలోని ప్లస్ పాయింట్స్ ఎదుటి వారిపై ప్రభావం చూపేలా నడుచుకోవడమే... దానికి ఈ ఆరు సూత్రాలను పాటిస్తే సరి...
1. ఎదుటి వారిలో మీ పట్ల స్వచ్ఛతను కనబర్చాలి...
2. నవ్వుతూ పలుకరించాలి..
3. ఎదుటి వారు కనపడినప్పుడు వారి పేరుతో పలుకరించడం, స్పష్టంగా, అర్ధమయ్యే రీతిలో సుళువైన భాషలో తియ్యగా మాట్లాడటం..
4. ఎదుటి వారికి ఎక్కువగా మాట్లాడే అవకాశం ఇవ్వడం.. మీరు చక్కగా వినడం..
5. ఇతరులకు నచ్చే రీతిలో మాట్లాడేలా అలవర్చుకోవడం.
6. ఎదుటి వారి అభిప్రాయాలకు విలువనిచ్చేలా వారితో మీరు నడుచుకోవడం.