Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అసూయ - ద్వేషాలు అధిగమిస్తేనే అన్నింటా విజయం

Advertiesment
అసూయ - ద్వేషాలు అధిగమిస్తేనే అన్నింటా విజయం
FILE
అసూయ...... నాటికీ, నేటికీ అనేక మంది పురోగతికి ఆటంకంగా నిలుస్తోంది. ఇది పేద, ధనిక తరగతులు అనే భేదం లేకుండా ఆయా తరగతులకు తగ్గట్టు తగిన మోతాదులో అసూయా, ద్వేషాలు రగులుతూనే ఉన్నాయి. మనం సాధించలేని దాన్ని మరెవరైనా సాధించారని తెలిస్తే ఉన్నట్టుండి అసూయ అక్కడ ప్రత్యక్షమవుతుంది. తద్వారా ఏదైనా చేటు జరిగేంతవరకు అది మనల్ని వదలదు.

విశాలభావంతో చూస్తే అలా అసూయకు గురికావడం మంచిదికాదనిపిస్తోంది. తనకు సాధ్యం కాని పనిని మరో వ్యక్తి సాధించగలిగారంటే దాన్ని ప్రశంసించాల్సి ఉంటుంది. అయితే అలా చేస్తే తనను అందరూ చులకనగా చూస్తారేమోనన్న భయమే అసూయగా బయటపడుతుంది. అసూయపరులు ఆందోళన చెందేవారుగా ఉంటే ఆ వ్యక్తి ఎటువంటి ఇబ్బందికి గురిచేస్తాడేమోనని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇలా అసూయతో ఆందోళన చెందే వారి నుంచి తమను తాము రక్షించుకోలేక ఇతరులు కూడా పలురకాలుగా నష్టపోతున్నారు.

దానికి ఒక ఉదాహరణ...
ఒక ఊరిలో పరమ దైవభక్తుడు ఉండేవాడు. భక్తి విషయంలో ఎటువంటి లోటు లేకపోయినా అన్ని తనకే తెలుసుననే అహం కలిగి ఉన్నాడు. ఆ భక్తుడు 20 ఏళ్లపాటు చేసిన కఠోర తపస్సుకు మెచ్చిన దేవుడు అతనకి ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమన్నాడు. అందుకు ఆ భక్తుడు ఎవరూ పొందలేని ఉన్నత స్థాయిని పొందాలని దేవుడిని కోరాలని మనసులో అనుకుంటున్న విషయాన్ని ఎరిగిన దేవుడు ఓ నిబంధన విధించాడు.

నీవు ఏ వరం అడిగినా ఇస్తాను కానీ నీవు పొందిన దానికి రెండింతలు నీ శత్రువు రవిచంద్ర ఇంట్లో ఉంటుందని తెలిపాడు. దాంతో ఆ భక్తుడు నిర్ఘాతపోయాడు. తాను తన శత్రువు కంటే ధనధాన్య విషయంగాను, గౌరవ మర్యాదల విషయంగాను హెచ్చుస్థాయిలో ఉండాలనుకుంటుంటే... ఈ వరం కోరుకోవడం వల్ల అంతా తలకిందులైపోతుందని చింతించే సమయంలో దేవుడు మళ్లీ కనిపించి భక్తా అడుగు నీ కోరికలు... నాకు అవతల చాలా పనులున్నాయని తొందరపెట్టాడు.

దాంతో ఆ భక్తుడు నా ఒక కన్నును గుడ్డిదానిని చేయమని కోరాడు. అంతే ఆ దేవదేవుడే ఒక్క క్షణం అదిరిపడ్డాడు. అందుకు దేవుడు భక్తా.. సిరిసంపదలను వదలి ఈ వరం కోరావు ఎందుకు? అని ప్రశ్నించాడు. అందుకు ఆ భక్తుడు... అవును నా శత్రువుకన్నా ఒక్క అడుగు ఎత్తులోనే ఉండాలని అనుకున్నాను. అందుకనే ఈ వరం కోరాను. నా శత్రువు అంధుడై ఇబ్బందులు పడుతుంటే నేను ఒక కంటితో చూసి ఆనందిస్తాను అని అన్నాడు.

సమాజంలో కొందరు అలానే ఉంటుండడం వల్ల తాము అభివృద్ధి చెందకపోగా ఇతరులు అభివృద్ధికే కాకుండా సమాజ అభివృద్ధికి కూడా ఆటంకంగా ఉంటారు. ఇటువంటివాళ్లు మానసిక వైద్యులను సంప్రదించాలి. కాని వాళ్లు చివరి వరకు వారు ఇటువంటి మానసిక వ్యాధితో బాధపడుతున్న విషయం తెలుసుకోలేరు. అసలు అంగీకరించలేరు.

Share this Story:

Follow Webdunia telugu