అబ్బా...! పక్కింటామెకు ఎన్ని నగలున్నాయో, ఇంటి నిండా ఎంత ఫర్నీచరుందో మాకే ఏమీలేదు... ఆ రమ్య చూడు ఎంత అందంగా ఉందో... నేనూ ఉన్నాను ఎందుకు...! ఇలాంటి వాటినే అసూయ అంటారు. అవతలివారి వద్ద ఉన్న గుణం లేదా వాస్తవం తమలో లేదన్న భావన వల్ల అసూయ మనసులో జనిస్తుంది. ఈ కారణంగానే అవతలి వారిని చూసి అసూయపడటం జరుగుతుంటుంది. |
అసూయ అన్నది ఒక బలహీనత, ఒక వక్రగుణం. చిన్న బుద్ధిగల వారే అసూయతో కృంగిపోతారు. పరిస్థితులు ఎటువంటివైనా మనం అసూయను సమర్ధించకూడదు. ఇది ముమ్మాటికి మనకు ఇంటాబయటా హానిని కలిగిస్తుంది. సక్రమమైన గుణాన్ని అభివృద్ధి పరుచుకోవడమే అసూయను దూరం చేసుకునే ఉత్తమ మార్గం. |
|
|
ఈ అసూయ అనేది ఏ మహిళలో... ఎంత మోతాదులో ఉన్నప్పటికీ, అది విషంలాగా పనిచేస్తుంది. అంతేకాదు అది మన మానసిక అరోగ్యాన్ని కూడా దెబ్బతీస్తుంది. అసూయకంటే దయాగుణం అనేది మనకు రెండింతల ఆశీర్వచనాలను అందజేస్తే... అసూయ మనకు నాలుగింతల హానిని కలుగజేస్తుంది.
మన నిజజీవితంలోనూ, పుస్తకాలలోనూ అసూయ వల్ల గలిగే నష్టాలను చూస్తూ ఉన్నప్పటికీ ఆచరణలోకి వచ్చేటప్పటి దాన్నుంచి తప్పించుకోలేక పోతున్నాం. మొదట అసూయ అనేది అతి చిన్న భావనగా మొలకెత్తినా... ఆ తరువాత అదే కొండతలా పెరుగుతూ వస్తుంది. ఆ కారణంగా మనం చెప్పలేనన్ని కష్టాలకు గురి అవుతుంటాము.
ఈ అసూయ అన్నది ఎలా పుట్టుకొస్తుంది? ఇతరులతో సరితూగనప్పుడంతా ఆ భావన మనలో అసూయకు జన్మనిస్తుంది. అవతలి వ్యక్తి మీకంటే అందంగా, సాంఘికంగా హెచ్చు పదవిలో... లేదా మీ కంటే కూడా ఎక్కువ పేరు ప్రఖ్యాతులను సంపాదించుకున్నా, ఎక్కువగా చదువుకున్నా అసూయ పుట్టుకొస్తుంది.
ఇక్కడ మనం ఒక విషయాన్ని చెప్పుకోవాలి. మన చేతి ఐదువేళ్ళను నిషితంగా పరిశీలించండి. అన్ని వేళ్లూ ఒక ఎత్తులో, లావులో ఉంటాయా..? అసలు ఒకదానికి మరోదానికి ఎలాంటి సామ్యం ఉండదు కదా..! అలాగని ఒక వేలు మరో వేలును చూసి అసూయపడుతుందా...? ఏ వేలు ఉపయోగం దానిదే కదా...!
మీ దగ్గర లేనిది అవతలివారి వద్ద ఉన్నదని అసూయపడకుండా భగవంతుడు మీకు ప్రసాదించిన తెలివితేటలను ఎంత ఉత్తమంగా మీరు వాడుకోగలరో అంత ఉత్తమంగా వాడుకోవాలి. మీ మనస్సు పరిపక్వదశకు వచ్చినప్పుడు మీలో ఉన్న మంచి గుణాలను అభివృద్ధి చేసేందుకు అది ప్రయత్నిస్తుంది. అప్పుడు ఇతరులను చూసి అసూయపడటానికి కావలసిన సమయంగానీ, శక్తిగానీ ఉండవు.
అసూయ అన్నది ఒక బలహీనత, ఒక వక్రగుణం. చిన్న బుద్ధిగల వారే అసూయతో కృంగిపోతారు. పరిస్థితులు ఎటువంటివైనా మనం అసూయను సమర్ధించకూడదు. ఇది ముమ్మాటికి మనకు ఇంటాబయటా హానిని కలిగిస్తుంది. సక్రమమైన గుణాన్ని అభివృద్ధి పరుచుకోవడమే అసూయను దూరం చేసుకునే ఉత్తమ మార్గం.