అడిగితేగాని ఏ పని చెయ్యడు..మీ భర్త కూడా ఇంతేనా?
, గురువారం, 4 ఏప్రియల్ 2013 (17:48 IST)
అడిగితే గాని ఏ పని చెయ్యడు.. అనేది భర్తపై అప్పుడప్పుడు మహిళలు చెప్పేమాట. అయితే భర్త మీద ఇలా ఇతరులకో, పుట్టింటికో ఫిర్యాదు చేయటమంటే భర్తను వేపుకుతినటమేనని మానసిక నిపుణులు అంటున్నారు. భార్య తనను ప్రేమగా అడగాలని, అలా అడిగిన పనిచేసి పెట్టి చూశావా నేను ఎలా నీ మాట వింటానో అని భార్యకు తెలియజెప్పాలని భర్త అనుకుంటాడు. కానీ అతనికి అటువంటి అవకాశం ఇవ్వకుండా అనవసరపు వేధింపుతో అతని నుండి ఏ విధమైన సహాయం పొందలేని స్థితి తెచ్చుకోవడం సరికాదు. ఇంటి పని మొత్తం మీ నెత్తిన వేసుకుని చేస్తున్నా దాని గురించి గొప్పగా చెప్పుకోకుండా ఇంటిపనిలో భర్త సహకారం కావాలనుకునేవారు ఈసడింపులు కట్టిపెట్టి, తమకు కావాల్సిన సహాయం ఏమిటో, ఎలా చేస్తే నచ్చుతుందో చెప్పి చేయించుకోవటం అవసరం.