Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మహిళలూ.. ఒత్తిడిని దూరం చేసుకోవాలంటే ఏం చేయాలో తెలుసా?

Advertiesment
మహిళలూ.. ఒత్తిడిని దూరం చేసుకోవాలంటే ఏం చేయాలో తెలుసా?
, గురువారం, 31 జులై 2014 (15:28 IST)
ప్రస్తుతం జీవితం ఉరుకులు పరుగులమయమై పోతోంది. ఈ నేపథ్యంలో చాలామంది ఒత్తిడికి గురై జబ్బులబారిన పడుతుంటారు. దీంతో మరింత అనారోగ్యానికి గురికాక తప్పడంలేదు. కానీ ఒత్తిడిని దూరంచేసి మనసుని ప్రశాంతంగా ఉంచగలిగితే ఆయుష్షు ప్రమాణాలు పెరుగుతాయని వైద్యులు అంటున్నారు. ఒత్తిడిని అధిగమించడం కంటే నిత్యం సంతోషంగా ఉంటూ తమ పని తాము చేసుకుంటూ పోతుంటే ఎలాంటి జబ్బులు దరి చేరవని వారు చెబుతున్నారు.  
 
ఎంత ఒద్దనుకున్నా ఈ రోజుల్లో పనిఒత్తిడి మగవారిలో కన్నా ఆడవారిలోనే ఎక్కువగా ఉంటోంది. మగవారు కేవలం ఆఫీసు వ్యవహారాలు మాత్రమే చూసుకుపోతారు. ఇంట్లోని ప్రతి చిన్న పనులుకూడా స్త్రీలతోనే చేయించుకుంటుంటారు. కనీసం తాము తాగాలనుకున్న నీటిని కూడా భార్యలే దగ్గరుండి అందించాలంటారు. 
 
ఆడవారి విషయంలో మాత్రం మగవారితో సమానంగా ఆఫీసు పనులు చక్కపెట్టడమే గాకుండా ఇంటి వద్ద మళ్లీ భర్త-పిల్లలకు, అత్త-మామలకు, ఇంటికి వచ్చే అతిథులకు రుచికరమైన ఆహారాన్ని చేసిపెట్టాలి. 
 
అయితే ఆడవారు ఎక్కువగా ఒత్తిడికి గురికాకుండా, తెలివిగా ఇంటిపనులను ప్రణాళికాబద్దంగా చేసుకుంటూపోతే సంతోషంగా జీవితాన్ని గడపవచ్చంటున్నారు పరిశోధకులు. దీంతో వారి ఆయుప్రమాణం పెరుగుతుందని అధ్యయనకారులు చెబుతున్నారు.
 
అలాగే మహిళలు తమ కార్యాలయాలలోకూడా ప్రణాళికాబద్ధంగా పనిచేస్తే అధికమైన ఒత్తిడికి గురికాకుండా ఉంటారు. రేపటి పనిగురించి ఇవాళ్లే ఆలోచించుకుని పని చేసుకోవాలి. దీంతో శరీరంపైనే కాకుండా మానసికమైన ఒత్తిడి ఉండదంటున్నారు. పరిశోధకులు.  
 
కార్యాలయంలో మీరు చేసేపనిని సానుకూల దృక్పథంతో ఆలోచించి చేయాలి. దీంతో ఒత్తిడి ఉండదు. ఒత్తిడి అధికంగా ఉన్నప్పుడు కాస్త ప్రాణవాయువును అధికంగా పీల్చి రిలాక్స్ అయ్యేదానికి ప్రయత్నించండి. మీ పక్కనున్న కొలిగ్‌తో సంభాషణ ప్రారంభించండి. కాసేపు చాయ్‌ అని మాటల్లో పెట్టండి. దీంతో మీలోనున్న ఒత్తిడి మటుమాయం అంటున్నారు పరిశోధకులు. 

Share this Story:

Follow Webdunia telugu