Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

సాంప్రదాయక వస్త్రధారణతో మనశ్శాంతి : అధ్యయనం

సాంప్రదాయక వస్త్రధారణతో మనశ్శాంతి : అధ్యయనం
, మంగళవారం, 14 అక్టోబరు 2014 (14:18 IST)
తమ జాతి సంప్రదాయాలకు అనుగుణమైన దుస్తులను మాత్రమే ధరించే పిల్లలు మానసిక సమస్యలకు దూరంగా ఉంటున్నట్టు తాజాగా నిర్వహించిన ఓ అధ్యయనంలో వెల్లడైంది. తూర్పు లండన్ పాఠశాల నుంచి 11-14 సంవత్సరాల ప్రాయంలోని బ్రిటిష్, బంగ్లాదేశ్ పిల్లలను ఆధారంగా చేసుకున్న ఈ సర్వే తమ జాతికి చెందిన స్నేహితులు, దుస్తులు లేదా ఇతర జాతులతో పిల్లల సాంస్కృతిక మూలాల గుర్తింపును అంచనావేసింది.
 
తమ జాతికి చెందిన లేదా పరాయి జాతులకు చెందిన స్నేహితులను కలిగిఉన్నా లేదా తమ సొంత సంస్కృతికి చెందిన స్నేహితులను మాత్రమే కలిగి ఉన్నా అది పిల్లల మానసికారోగ్యంపై ఏమంత ప్రభావం కల్గించలేదని ఈ సర్వే పేర్కొంది. అయితే దుస్తుల విషయంలో మాత్రమే కాస్త తేడా వచ్చిందట. 
 
ఎలాగంటే తమ జాతి సాంప్రదాయిక దుస్తులను ధరిస్తూ వస్తున్న బంగ్లాదేశ్ విద్యార్థులు అటు సాంప్రదాయక దుస్తులను ఇటు బ్రిటిష్ మరియు అమెరికా దుస్తులను కూడా ధరిస్తున్న విద్యార్థులతో పోలిస్తే మానసిక సమస్యలను తక్కువగా కలిగిఉన్నారని ఈ సర్వేలో తేలింది.
 
ఈ అంశాన్ని లింగ ప్రాతిపదికన పరిశీలించినప్పుడు ఇది బాలికల విషయంలో మరీ వాస్తవంగా నిర్థారించబడడం గమనార్హం. అయితే శ్వేత జాతి బ్రిటిష్ విద్యార్థులు తమ స్వంత సంస్కృతికి చెందిన మరియు ఇతర సంస్కృతులకు చెందిన దుస్తులను కలిపి ధరిస్తున్నప్పటికీ వారి మానసికారోగ్యం సాపేక్షికంగా బాగుందని పరిశోధకులు పేర్కొన్నారు. 
 
నేటి కాలంలో యువత ప్రత్యేకించి మానసిక సమస్యలకు గురవుతోందని, వారి సాంస్కృతిక గుర్తింపు ప్రధానంగా దుస్తులు మరియు స్నేహాల ఎంపికతో ముడిపడి ఉందని వీరు పేర్కొంటున్నారు. ఏదైనా బహుళ సంస్కృతీ సమాజంలో జీవిస్తున్న యువతకు సాంస్కృతిక సమైక్యత అత్యంత ఆరోగ్యకరమైన అంశంగా ఉంటుందని ఈ పరిశోధకులు స్పష్టం చేశారు. 
 
అయితే ఇలాంటి సమాజాల్లో జీవనశైలి, ప్రవృత్తులు లేదా ప్రవర్తలు వంటి అంశాలను మార్చుకోవడం అనేదే బాగా వత్తిళ్లకు గురిచేస్తూంటుందని వీరి భావన. కాబట్టి చక్కటి మానసికారోగ్యం కావాలంటే వస్త్రధారణ రూపంలో సాంస్కృతిక గుర్తింపును అట్టిపెట్టుకోవడం చాలా ముఖ్యమని ఈ పరిశోధన తెలుపుతోంది. 

Share this Story:

Follow Webdunia telugu