కాలేజీలో చేరాక అబ్బాయిలు ఆటపట్టించడం, వ్యాఖ్యలు చేయడం వంటివి అమ్మాయిలకు ఎదురవుతాయి. ఇతర అమ్మాయిల్లా దూకుడుగా ఉండలేకపోతున్నాం అని అనిపించడమూ జరుగుతుంది. కానీ వాటినే తలుచుకుంటూ ఉండిపోతే ప్రయోజనం శూన్యం. అందుచేత వాటిని ఎదుర్కొనేందుకు మానసికంగా సిద్ధం కావాలి. కొన్నిటిని చూసీచూడనట్లు వదిలేయాలి.
ఏ సమస్యయినా శ్రుతి మించుతోందని అనుకున్నప్పుడు వెంటనే స్పందించాలి. ఈ రెంటిలో ఏది ఎప్పుడు చేయాలన్న వివేచన కలిగివుండాలి. అందుకోసం అమ్మానాన్నలూ, స్నేహితురాళ్ల సాయం తీసుకోవాలి.
కాలేజీల్లో చేరాక ఇతరులతో పోల్చుకోవడం చేయకూడదు. తమలో ఉండే ప్రత్యేకతలు గుర్తించాలి. ఇతరుల కోసం మీ పద్ధతులు మార్చుకోకూడదు. ఇతరులకు మీరే ఆదర్శంగా ఉండేలా ప్రవర్తించాలి. చదివేటప్పుడు అర్థం చేసుకుని చదవాలని మానసిక నిపుణులు అంటున్నారు.