Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మహిళలు ఎంత మంచి వాళ్లంటే..? తామున్నది కుటుంబం కోసమే..?

Advertiesment
మహిళలు ఎంత మంచి వాళ్లంటే..? తామున్నది కుటుంబం కోసమే..?
, మంగళవారం, 28 అక్టోబరు 2014 (15:09 IST)
మహిళలు ఎంత మంచి వాళ్లంటే తాము వున్నది.. తమ కుటుంబం కోసమే అనుకుంటున్నారు. వృత్తిపరంగా ఉన్నత స్థానంలో ఉన్నా.. ఇంటిపని, ఆఫీసు పని ముగించుకుని.. తాము వున్నది తమవాళ్ళను సంతోషపెట్టడానికే అనుకుంటారు. తమవసరాల కంటే కుటుంబ అవసరాలే ముఖ్యమనుకోవటం చాలామంది మహిళల స్వభావం. 
 
వండి వడ్డించడం, శుభ్రతకు సంబంధించిన పనులు చేయటం, కావాల్సిన సరుకులు కొని తెచ్చి అవసరానికి వాడటం, భర్త, పిల్లలు, అత్తమామలు, తల్లిదండ్రులను శ్రద్ధగా చూసుకోవడం-వీటన్నింటిలోనే  తమకు ఆనందం వుందంటారు. 
 
మీకంటూ ఆనందం పొందటానితి మీరేం చేస్తున్నారని మహిళల్ని అడిగితే, అలా సొంత ఆనందాలు చూసుకోవడం స్వార్థమేమో అనిపిస్తుంది. కానీ మహిళల అవసరాలు ఎంతగా తీరితే ఇతరులకి సహాయపడటం వారికి అంతగా తేలికమవుతుంది.
 
అందుచేత మహిళలు ఏం చేయాలంటే.. సరదాగా వుండేందుకు వీలుగా మంచి సినిమాకు వెళ్లండి. భాగస్వామితో కబుర్లు చెప్పుకోండి. పుస్తకాలు చదవండి. ఎప్పుడూ పనీపనీ అని పరిగెత్తక రిలాక్స్ కోసం గదిలో ఒంటరిగా గడపండి. పెట్స్‌తో ఆడుకోండి. పిల్లలు, భర్తతో సన్నిహితంగా గడపండి. 
 
ఒకరోజు సెలవు పెట్టేసి.. పార్కులకు వెళ్లి తిరిగిరండి. ప్రత్యేక సందర్భాన్ని ఫోటోలతు శాశ్వతం చేయండి. సౌందర్యపోషణపై దృష్టి పెట్టండి. చిన్నప్పుడు మీరెలా చేసేవారో గుర్తుతెచ్చుకుని ఆస్వాదించండి. ఇలా చేస్తే మైండ్ రిలాక్స్ అవుతుంది. తద్వారా ఎలాంటి కష్టమైన పనిని ఈజీగా చేయగలరని మానసిక నిపుణులు సలహా ఇస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu