Publish Date: Mon, 21 Dec 2015 (12:38 IST)
Updated Date: Mon, 21 Dec 2015 (12:43 IST)
కొత్తగా జాబ్‌లో చేరి ఉద్యోగులు మొదట్లో కొన్ని రోజులు బెరుకుబెరుకుగా ఉంటారు. అలాంటి వారు విధిగా కొన్ని సూచనలు, చిట్కాలు పాటించడం వల్ల ఆ బెరుకును అధికమించవచ్చు. ఆ చిట్కాలు ఏంటో ఓసారి పరిశీలిద్ధాం.
పని గురించిన రకరకాల విషయాలు, నియమనిబంధనలు ముందుగానే స్పష్టంగా అడిగి తెలుసుకోవాలి. అలా తెలుసుకుంటేనే ఆ వాతావరణంలో బాగా పని చేయగలుగుతారు. ఆఫీసు మీటింగ్స్ తప్పకుండా హాజరవ్వాలి. పనిచేసే విభాగం మాత్రమే కాకుండా ఇతర డిపార్ట్‌మెంట్‌లో పనిచేసే ఇతరులతో కూడా కలివిడిగా మాట్లాడటం అలవర్చుకోవాలి.
దుస్తుల విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. చూసే వారికి మంచి ఇంప్రెషన్ కలగాలి. ఆఫీసులో వ్యక్తులతో మిమ్మలను మీరే పరిచయం చేసుకోవాలి. తోటి ఉద్యోగులతో సంభాషించాలి. స్నేహపూరితంగా మెలగాలి. కొన్నివిషయాల పట్ల చర్చిండం వంటివి చేస్తుండాలి.
వర్క్ విషయంలో ఎప్పుడు ఎటువంటి సందేహం వచ్చిన కోలీగ్స్‌ని అడిగి తెలుసుకోవాలి. టీమ్ మీటింగ్‌లో మీ ఆలోచనల్ని, అభిప్రాయల్ని చెప్పడానికి సంకోచించవద్దు. ముఖ్యంగా.. గతంలో చేసిన ఉద్యోగంతో కొత్తగా చేరిన ఉద్యోగాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ పోల్చరాదు. ఏదైన సమస్య ఉంటే బాస్‌తోనే మాట్లాడి పరిష్కరించుకోవాలి.