తెల్లవారాక చేసే పనుల ఆలోచనలు లేకుండా రాత్రంతా ప్రశాంతంగా, హాయిగా నిద్రపోయే మార్గాలు ఏంటో తెలుసుకోవాలా.. అయితే చదవండి. మరునాటి పనుల హడావుడి మనస్సులో తొలుస్తుంటే కంటిమీదకు కునుకు రావడం కొంచెం కష్టమే. పనుల్ని రెండుగా విభజించుకుని జాబితా తయారు చేసుకోవాలి. వ్యక్తిగత, వృత్తిపరమైన విధంగా జాబితాలు తయారు చేసుకోవాలి.
మరునాడు ధరించాల్సన దుస్తుల ఆలోచన తొలచకుండా ముందే సిద్ధం చేసుకుని పడక చేరాలి. నిద్రకు ఉపక్రమించేముందు ఒక్క పది నిమిషాలు ధ్యానం చేస్తే మనస్సు శరీరం ప్రశాంతంగా సేదతీరుతాయి. వ్యక్తిత్వ వికాసం, హాస్యం, చక్కని ఆలోచనల్ని కలిగించే పుస్తకాలు చదవాలి. గోరువెచ్చని పాలు సుఖనిద్రను ఇస్తాయి.
పిల్లలతో కలిసి గడపడం, వారికి కథల పుస్తకాలు చదివి వినిపించడం, చక్కని సంగీతం వినడం, వేడినీటి స్నానం, సులువైన వ్యాయామాలు వంటివి ఏ ఆలోచనలూ లేని చక్కటి నిద్రను సొంతం చేస్తాయి. మరునాటిని తాజాగా, హుషారుగా ఆరంభించవచ్చు.