క్షణం తీరిక లేదా.. ఐతే సమయపాలన అవసరం.. ఈ టిప్స్ పాటించండి
క్షణం తీరిక లేదనుకుంటున్నారా? అయితే సమయపాలన చాలా అవసరమని గుర్తించండి. హడావుడిగా టెన్షన్ పడుతూ పనులు చేసుకుంటుంటే.. తప్పకుండా మీరీ టిప్స్ పాటించాల్సిందే. ఆఫీసుల్లో, ఇళ్ళల్లో చాటింగ్‌లకు చెక్ పెట్టండి.
క్షణం తీరిక లేదనుకుంటున్నారా? అయితే సమయపాలన చాలా అవసరమని గుర్తించండి. హడావుడిగా టెన్షన్ పడుతూ పనులు చేసుకుంటుంటే.. తప్పకుండా మీరీ టిప్స్ పాటించాల్సిందే. ఆఫీసుల్లో, ఇళ్ళల్లో చాటింగ్‌లకు చెక్ పెట్టండి. ఎస్సెమ్మెస్ ఇవ్వడం కంటే ఫోన్ చేయడమే మంచిది. సామాజిక మాధ్యమాలకు దూరంగా ఉండి. సామాజిక మాధ్యమాలతో గడుపుతున్నప్పుడు తెలియకుండానే గంటల సమయం వృథా అవుతుంది.
కొన్నిసార్లు వాటిల్లో పడి ముఖ్యమైన పనుల్ని కూడా మర్చిపోతుంటాం. అందుకే ఓ పని చేయండి. రోజులో మూడుసార్లు అదీ ఐదు నిమిషాల చొప్పున మాత్రమే సామాజిక మాధ్యమాలను చూడాలనే నియమాన్ని పెట్టుకుని చూడండి. పనుల్ని పంచుకోండి. ఇంట్లోనూ సరే, కార్యాలయంలోనూ సరే పనుల్ని పంచుకుని చేయడం అలవాటు చేసుకోండి. తద్వారా ఒత్తిడి కూడా తగ్గుతుంది.
ఆఫీసులకు వెళ్తున్నప్పుడు పావు గంట ముందే బయల్దేరండి. మర్నాడు చేయాల్సిన పనుల్ని కొన్ని ముందురోజే పూర్తయ్యేలా చూసుకోవాలి. ముఖ్యంగా మర్నాడు చేయాల్సిన వంటకు అవసరమైన పదార్థాలూ, వేసుకోవాలనుకున్న దుస్తులూ, వాటికి సంబంధించిన యాక్సెసరీలూ.. ఇలా వీలైనంతవరకూ సిద్ధంగా పెట్టుకుంటే ఎంతో సమయం కలిసొస్తుంది. అలాగే టైమ్ కలిసి రావాలంటే నోట్ బుక్‌లో చేసే పనుల్ని రాసిపెట్టుకోండి.
ఏ రోజుకారోజు చేయాలనుకున్న పనుల్ని అందులో రాసుకోండి. పిల్లలకు హోమ్ వర్క్ కోసం రెండు గంటల టైమ్ కేటాయించండి. వారికి టైమ్‌కి తినిపించి.. నిద్రపుచ్చేలా చేయాలి. స్కూలుకు తీసుకెళ్లే ముందు సమయపాలన అవసరసమని గుర్తించండి. టెన్షన్ లేకుండా పనులైపోవాలంటే.. సమయపాలన అవసరమని.. తద్వారా ఒత్తిడి దూరమవుతుందని.. ఒత్తిడి దూరమైతే అనారోగ్య సమస్యలు, గుండెపోటు వంటి వ్యాధులు దూరమవుతాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.