సాధారణంగా అనేక మంది మూడ్ బాగోలేదని అంటుంటారు. ఇలాంటి వారిని చూసేందుకు ఇతరులకు బాగుండక పోవచ్చు. కానీ, మూడ్ బాగోలేని వారికి మాత్రం ఇది మంచిగా ఉంటుంది. ఎందుకంటే చెడు మూడ్‌ను ప్రదర్శించే వారికి జ్ఞాపశక్తి ఎక్కువగా ఉంటుందట. ఇతరులను అంచనా వేయడంలో మెరుగ్గా ఉంటారు. ఇతరుల మాటలను అంత సులభంగా నమ్మనే నమ్మరట.
సరైన మూడ్ లేనివారు తమ పరిసరాలను బాగా గమనిస్తారు. ఆనందకర మూడ్‌లో ఉండేవారు పట్టించుకోలేకపోయినా అంశాలను కూడా మూడ్ సరిగా ప్రదర్శించలేనివారు గమనించి అర్థం చేసుకుంటారు. వీరి ఆలోచనలు చాలా సమతుల్యంతో ఉంటాయి. తొందరపడి ఓ నిర్ణయానికి రాలేవు. మూడ్ సరిగా లేనివారు హఠాత్తు నిర్ణయాలు అస్సలు తీసుకోరట.
భాష, మతం, జాతిపరమైన తేడాలను పట్టించుకోరు. అందరినీ ఒకేలా చూడగలిగిన గుణం వీరి సొంతం. తమ వాదనను చక్కని పద్దతిలో కాగితం మీద పెడతారు. ఇటువంటి మూడ్ కలిగిన లాయర్స్ విజయం సాధించటం వెనకున్న పరమరహస్యం ఇదే.