Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

విడాకులు తీసుకున్నాను... పక్కింటతను అదోలా చూస్తున్నాడు... ఏంటి నా పరిస్థితి..?

మాది ప్రేమ వివాహం. పెళ్లికి ముందు ఆయన ప్రవర్తన, పెళ్లి తర్వాత ప్రవర్తన చాలా తేడా. ఎన్నో అవమానాలు భరించాను. ఎలాగైనా సర్దుకుని ఉందామని అనుకున్నాను. ఐనా నావల్ల కాలేదు. అతడి మానసిక వేధింపులు తట్టుకోలేక విడాకులు తీసుకున్నాను. ఐతే నేను నా పుట్టింటికి వెళ్ల

విడాకులు తీసుకున్నాను... పక్కింటతను అదోలా చూస్తున్నాడు... ఏంటి నా పరిస్థితి..?
, మంగళవారం, 24 మే 2016 (17:03 IST)
మాది ప్రేమ వివాహం. పెళ్లికి ముందు ఆయన ప్రవర్తన, పెళ్లి తర్వాత ప్రవర్తన చాలా తేడా. ఎన్నో అవమానాలు భరించాను. ఎలాగైనా సర్దుకుని ఉందామని అనుకున్నాను. ఐనా నావల్ల కాలేదు. అతడి మానసిక వేధింపులు తట్టుకోలేక విడాకులు తీసుకున్నాను. ఐతే నేను నా పుట్టింటికి వెళ్లలేదు. అక్కడికెళితే మరో సమస్య. నా తర్వాత పెళ్లి కావాల్సిన ఇద్దరు చెల్లెళ్లున్నారు. నేను వెళితే వారికి అడ్డు అని మా పేరెంట్స్ రమ్మన్నా వెళ్లలేదు. ఒక్కదాన్నే వేరే ఇంట్లో ఉంటూ నా ఒక్కగానొక్క కుమార్తెను చూసుకుంటూ ఉంటున్నాను. ఐతే ఈమధ్య పక్కింట్లో అద్దెకొచ్చిన ఓ యువకుడు నన్ను అదో మాదిరిగా చూస్తున్నాడు. అతడే కాదు... ఇద్దరుముగ్గురు ఏదో వక్రంగా చూస్తున్నట్లు అనిపిస్తోంది. విడాకులు తీసుకున్న మహిళకు ఇలా భయంభయంగా గడపాల్సి రావడంపై నేను చాలా బాధతో ఉన్నాను. అసలిప్పుడు నా పరిస్థితి ఏమిటో తెలియడంలేదు...
 
విడాకులు తీసుకున్నవారిలో చాలామంది ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొంటుంటారు. ముఖ్యంగా ఒంటరిగా ఉన్న మహిళలు అంటే మరీ అలుసు. ఐతే అంతమాత్రాన భయపడాల్సిందేమీ లేదు. విడాకులు తీసుకోగానే జీవితం అగమ్యగోచరం కాదు. మీరు సర్దుకుపోదామని ప్రయత్నించినా అతడు ఆ దిశగా అడుగులు వేయలేదు. కనుక బాధపడాల్సిందేమీ లేదు. 
 
మీరు ఒంటరిగా ఉన్నప్పటికీ ధైర్యంగా మీ నిర్ణయాలు ఇప్పుడు మీరు తీసుకోగలుగుతారు. అలాగే మీపై మీకు ఆత్మవిశ్వాసం రెట్టింపు చేసుకోవాల్సిన సమయం కూడా ఇదే. పెళ్లయ్యేంతవరకూ ఎలా పట్టుదలతో చదివారో, ఉన్నారో ఇప్పుడు కూడా అలాగే ఉండవచ్చు. పొరుగున ఉన్నవారు ఏదోలా చూస్తున్నారని అనుకోవద్దు. మీరు వారిని పట్టించుకోవడం మానేయండి. మీ జాగ్రత్తలో మీరు ఉంటూ కెరీర్ పరంగా ఉన్నత శిఖరాలను చేరుకునేందుకు ప్రయత్నం చేయండి. మీ ఆలోచనలు అటే ఉండేలా జాగ్రత్త తీసుకోండి. అనుకున్నది మీరు సాధిస్తారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అందం, ఆయుష్షుని పెంచే యోగా