Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కెరీర్‌లో రాణించాలంటే.. మార్పును ఆహ్వానించాలి!

కెరీర్‌లో రాణించాలంటే.. మార్పును ఆహ్వానించాలి!
, సోమవారం, 22 డిశెంబరు 2014 (13:00 IST)
కెరీర్‌లో రాణించాలంటే.. మార్పును ఆహ్వానించాలని మానసిక నిపుణులు అంటున్నారు. ధరించే దుస్తులూ, మాట్లాడుతున్న ప్రతిమాటా మన గురించిన ఒక సందేశాన్ని ఇతరులకు తెలియజేస్తుంది. నాయకత్వ లక్షణాలు పెంచుకోవాలనుకొనే వారైతే అందుకు తగిన వస్త్రధారణ ఉండాలి. మాటల్లో ఆత్మవిశ్వాసం ఉండాలి. కానీ ప్రతి దానికీ సంజాయిషీ ఇస్తున్న ధోరణి కనిపించకూడదు. 
 
కెరీర్‌లో అడుగుపెట్టి పెట్టగానే ర్యాంకులు, స్థానాల గురించి ఆలోచించడం మంచి పనికాదు. తొలిరోజుల్లో హార్డ్‌వర్క్‌కి మాత్రమే ప్రాధాన్యం ఇవ్వాలి. చిన్న పని నుంచి మొదలు పెట్టి కష్టం అనుకొనే ప్రతి పనీ స్వయంగా చేయాల్సిందే. కానీ కెరీర్‌లోడ పైకి ఎదుగుతున్న సాఫ్ట్‌స్కిల్స్‌కి ప్రాధాన్యం ఇవ్వాలి. నైపుణ్యం అవసరమైన బాధ్యతల్ని ఎక్కువగా తీసుకోవాలి. అప్పుడు ప్రతి పనినీ దగ్గరుండి చేయడం కాకుండా చేయించుకోవడం తెలియాలి. 
 
ఇంటి పనుల్నీ, ఆఫీసు పనుల్నీ సమన్వయం చేసుకోవాలంటే చక్కని స్నేహితురాళ్లూ, సహోద్యోగుల నెట్‌వర్క్‌ని ఏర్పరుచుకోవడం చాలా అవసరం. ఆఫీసులో పనులు వేగంగా పూర్తి చేసుకోవాలన్నా, ఇంటి దగ్గర పిల్లలకు ఏ ఇబ్బంది రాకూడదని అనుకొన్నా.. ఈ తరహా నెట్‌వర్క్ చాలా అవసరం. 
 
మీ బృందంలోకి మీ కంటే తెలివైన వాళ్లని ఆహ్వానించడానికి ఎంతమాత్రం సంకోచించవద్దు. దానివల్ల మీ ఆలోచనల పరిధిని విస్తరించుకోవచ్చు. ఇతరులతో పోలిస్తే మీ బృందం ముందు చూపుతో ఆలోచిస్తుంది అనడానికి బ్రాడ్ మైండ్ ఉండాల్సిందే అంటున్నారు మానసిక నిపుణులు. 

Share this Story:

Follow Webdunia telugu