Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

విజయ సాధనకు ఏడు సూత్రాలు...!

Advertiesment
విజయ సాధనకు ఏడు సూత్రాలు...!
, శుక్రవారం, 5 సెప్టెంబరు 2008 (18:47 IST)
FileFILE
మహిళలుగా మీరు ఎన్నుకున్న మార్గంలో విజయం సాధించాలంటే... ఇప్పటికే అనేక విజయాలను సాధించిన వ్యక్తుల జీవితాల నుంచి మంచి విషయాలను స్వీకరించి వాటి మార్గ నిర్దేశకత్వంలో నడవాలి. అంతేగానీ మీరు విజయం సాధించాలంటే... అందుకు సంబంధించిన సూత్రాలను ఎవరూ అమ్మరు, అమ్మలేరు. ఎందుకంటే అలాంటివి ఉండవు గనుక.

విజయ సాధనకు... విజయ శిఖరాగ్రాలను చేరుకున్న అనేకమంది పెద్దల జీవితాల గురించి తీవ్రంగా, చిత్తశుద్ధితో అధ్యయనం చేసి ఓ శాస్త్రీయమైన దృష్టిని అలవర్చుకోవడం అత్యావశ్యకం. అలాంటి పెద్దలనుండి స్వీకరించిన ఏడు ముఖ్యమైన విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. వీటిని "విజయానికి శాసనాలు" అనటంలో ఏ మాత్రం సందేహం లేదు.

మొదటిది.... సరైన గమ్యస్థానం

జీవితంలో మీకొక లక్ష్యం, ప్రయోజనం లేకపోయినట్లయితే పరిస్థితులకు బలి పశువులుగా మారిపోతారు కాబట్టి, ప్రతి ఒక్కరికి సరైన గమ్యస్థానం అనేది చాలా ముఖ్యం. సరైన గమ్యస్థానం అనేది మనలో ఉన్న అభ్యుదయాన్ని ఉదయింపజేస్తుంది. చాలామందిలాగా ఎలాంటి గమ్యస్థానం లేకుండా ఉండకుండా పరిస్థితులపై ఆధిపత్యం సాధించి అదుపులో పెట్టేందుకు ప్రయత్నించండి. జీవితానికి ఒక ప్రయోజనం ఉన్నట్లయితే అది క్రియాశీల ఆశను ఉత్తేజపరచేదిగా ఉండాలి.

రెండవది... విద్య లేక సన్నాహం

ప్రయోజనాన్ని సాధించేందుకు అవసరమైన పరిజ్ఞానం విద్య నుంచి వస్తుంది కాబట్టి తగినంత విజ్ఞానాన్ని సంపాదించుకోండి. విజయం సాధించిన పెద్దలంతా తమ, తమ ప్రత్యేక వృత్తుల్లో స్వయంగా విద్యాభ్యాసం పొందినవారే. విద్యాభ్యాసమంటే కేవలం పుస్తకాల ద్వారా నేర్చుకునేదే కాదనీ... వ్యక్తిత్వ అభివృద్ధి, నాయకత్వం, అనుభవం, పరిచయాలు, అనుబంధాల ద్వారా జ్ఞాన సముపార్జన మరియు పరిశీలన కూడా కలిసి ఉండాలని వారు గుర్తించారు. దీన్ని మననం చేసుకోవాలి.

మూడవది... మంచి ఆరోగ్యం

కంటి నిండా నిద్ర, వ్యాయామం, పుష్కలమైన తాజా గాలి, పరిశుభ్రత, సరైన ఆలోచన, అస్వస్థత, వ్యాధి... లాంటివి మన శరీరం ప్రకృతి ధర్మాలను పాటించడం వల్ల వస్తాయి. ఇవి ఆరోగ్యానికి చెందిన శారీరక చట్టాలు. శారీరక స్థితిపైన మానసిక స్థితి చెప్పుకోదగిన ప్రాబల్యం కలిగి ఉంటుంది. ఆత్మవిశ్వాసం అనే మానసిక వైఖరి వల్లనే విజయం సాధించిన వారిలో చాలామంది నిర్మాణాత్మకంగా ఆలోచిస్తారు.

నాల్గవది.... చొరవ

చురుకుదనం లేనివారు పని పూర్తి చేయలేరు. ఒక విజయవంతమైన మహిళ తను చొరవగా ఉండటమే కాక తన క్రింద పని చేసేవారిలో కూడా చొరవను కలిగిస్తుంది. శక్తి, చొరవ, నిరంతర ప్రేరణ లేకుండా ఒక మహిళ నిజంగా విజయం సాధించలేదు.

ఐదవది... సమయోచిత బుద్ధి

జీవితంలో తరచుగా ఆపదలను, అడ్డంకులను, అనుకోని సమస్యలను ఎదుర్కోని మహిళలు ఎవరున్నారు చెప్పండి. ఈ పరిస్థితుల్ని ఎదుర్కొనేందుకు మనకు సమయోచిత బుద్ధి చాలా అవసరం. ఆందోళన స్థితిలో కార్యనిర్వహణకు సిద్ధపడినా, ఉద్రేకమైన నిర్ణయాలు తీసుకోకుండా ఉండటం అలవాటు చేసుకోవాలి. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుని దాన్ని అమలు చేయాలి.

ఆరవది... పట్టుదల

సాధించాల్సిన విజయంపై ఎక్కువ విశ్వాసం, పట్టుదల కలిగి ఉంటే... విజయం దానంతటదే సిద్ధిస్తుంది. మహిళలకు సహజంగా ఉండే "ఆ... ఇంకే చేస్తాంలే..." అనే నిర్లక్ష్యభావాలను వీడి, లక్ష్యంపై గురిపెట్టి... పట్టుదల సడలకుండా తీవ్రంగా శ్రమిస్తే విజయం మీ ముంగిట వాలుతుంది.

ఏడవది... విజయం

పైన చెప్పుకున్న అన్నింటి సాధనలో చివరగా లభించే ఫలితమే విజయం. ఇది అన్ని రకాలుగా ప్రధానమైనది. పైన చెప్పిన విజయానికి శాసనాలనబడే సూత్రాలను తప్పక పాటించిన మహిళలు తమ తమ రంగాల్లో విజయబావుటాను ఎగురవేస్తారు. తమదైన ముద్రను నిలుపుకుంటారు.

Share this Story:

Follow Webdunia telugu