Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ప్లాస్టిక్ బొట్టు బిళ్లలు పెట్టుకుంటే..? నుదుటన కుంకుమ ఏ దిశలో నిల్చుని ధరించాలి?

మహిళలు ఏ దిశలో నిల్చుని నుదుటన కుంకుమ ధరించాలో తెలుసుకోవాలంటే.. ఈ స్టోరీ చదవాల్సిందే. వివాహిత మహిళలు పాపటి నేరుగా కుంకుమను ధరిస్తారు. ఇలా నుదుటన కుంకుమ ధరించే మహిళలు తూర్పు దిశగా నిల్చుని.. ''ఓం శ్రీం

ప్లాస్టిక్ బొట్టు బిళ్లలు పెట్టుకుంటే..? నుదుటన కుంకుమ ఏ దిశలో నిల్చుని ధరించాలి?
, గురువారం, 20 జులై 2017 (18:00 IST)
మహిళలు ఏ దిశలో నిల్చుని నుదుటన కుంకుమ ధరించాలో తెలుసుకోవాలంటే.. ఈ స్టోరీ చదవాల్సిందే. వివాహిత మహిళలు పాపటి నేరుగా కుంకుమను ధరిస్తారు. ఇలా నుదుటన కుంకుమ ధరించే మహిళలు తూర్పు దిశగా నిల్చుని.. ''ఓం శ్రీం శ్రియై నమః.. సం శుభం భూయాత్'' అనే లక్ష్మీ మంత్రాన్ని పఠించి.. కనుబొమ్మల మధ్యన కుంకుమ ధరించాలి. తద్వారా సుమంగళీ మహిళలకు లక్ష్మీ కటాక్షం చేకూరుతుంది. ఇంకా దృష్టి దోషాలు తొలగిపోతాయి. 
 
కనుబొమల మధ్య ఉన్న ప్రదేశాన్ని అవిముక్త క్షేత్రమని కూర్మ పురాణం అంటుంది. కనుబొమల మధ్య కొంతమంది గంధం పెట్టి బొట్టు పెట్టుకుంటారు. ఇది చల్లదనాన్ని ఇస్తుంది. మనస్సుకు శరీరానికి చల్లదనం కలుగుతుంది. శివుడికి జ్ఞాననేత్రానికి గుర్తుగా నుదుట కుంకుమ ధారణ చేస్తారు. 
 
మానవ శరీరంలో వున్న రకరకాల అంగాలకు, అవయవాలకు ఒక్కో దేవత లేదా దేవుడు అధిపతులుగా ఉంటారు. ఇందులో భాగంగానే నుదుటకి బ్రహ్మదేవుడు అధిపతిగా వుంటాడు. బ్రహ్మదేవుడి ప్రియతమ రంగు ఎరుపు. అందువల్లే బ్రహ్మస్థానమైన నుదుట ఎరుపు రంగులో వున్న బొట్టును పెట్టుకోవడం జరుగుతోంది. నుదుటి ప్రాంతాన్ని సూర్యకిరణాలు అస్సలు తాకకూడదు. అందుకోసం కూడా నుదుటకు బొట్టు ధరించాల్సి వుంటుంది.
 
ఫ్యాషన్ పేరిట కుంకుమ నుదుటన పెట్టుకోకుండా.. ప్లాస్టిక్ బొట్టు బిళ్లలను పెట్టుకుంటే.. దాంపత్య జీవితంలో సమస్యలు తప్పవు. అనుకోని ప్రమాదాలు ఏర్పడతాయి. ఉంగరపు వేలితో కుంకుమను పెట్టుకుంటే మానసికంగా ఎంతో ప్రశాంతత, శాంతి లభిస్తుంది. నడివేలితో ధరిస్తే మానవుని ఆయువు సమృద్ధి చెందుతుంది. బొటన వేలితో పెట్టుకుంటే అనూహ్యమైన శక్తి పెరుగుతుంది. చూపుడు వేలితో ధరిస్తే చెడు అలవాట్లు అన్నీ సమసిపోయి, ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బీరువాను ఇలా పెడితే సర్వ నాశనమే...!