Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

శివాలయాల్లో నందీశ్వరుడికి అడ్డుగా నిలుస్తున్నారా?

శివాలయానికి వెళ్తే మనల్ని ముందుండి ఆహ్వానించేది.. నందీశ్వరుడే. అందుకే శివుని అనుగ్రహం లభించాలంటే.. ముందు నందీశ్వరుడిని నమస్కరించుకోవాలంటారు ఆధ్యాత్మిక పండితులు. శివుని వాహనం శ్వేత బసవన్న. శ్వేత రంగులో

Advertiesment
Nandiswara
, గురువారం, 8 మార్చి 2018 (17:19 IST)
శివాలయానికి వెళ్తే మనల్ని ముందుండి ఆహ్వానించేది.. నందీశ్వరుడే. అందుకే శివుని అనుగ్రహం లభించాలంటే.. ముందు నందీశ్వరుడిని నమస్కరించుకోవాలంటారు ఆధ్యాత్మిక పండితులు. శివుని వాహనం శ్వేత బసవన్న. శ్వేత రంగులో వుండే నందీశ్వరుడిని శివాలయాల్లో పూజించడం.. అర్చించడం ద్వారా ఈతిబాధలుండవు.

బసవ రూపం.. సంపదకు, సంతోషానికి సంకేతం. శివాలయంలో శివునికి ఎదురుగా వుండే నందీశ్వరుడిని ధర్మానికి మారుపేరుగా చెప్తారు. కాలాలు, యుగాలు మారినా ధర్మం అనేది చిరస్థాయిగా నిలిచిపోతుంది. ఆ ధర్మమే శివునికి వాహనంగా నిలుస్తోందని.. ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. 
 
శివాలయంలో నందీశ్వరుని అడ్డుగా నిలవడం, ప్రదక్షిణలు చేయడం కూడదు. అలాగే నందీశ్వరుడిని తాకడం, ఆయన విగ్రహం కింద ప్రణామాలు చేయడం కూడదు. ఎందుకంటే.. నందీశ్వరుడి శ్వాస శివలింగంపై ఎల్లప్పుడు పడుతూ వుంటుందని విశ్వాసం. నందీశ్వరుడు వదిలే శ్వాసనే ఈశ్వరుడు పీల్చుకుంటాడని నమ్మకం. ఓ మునీశ్వరునికి బసవన్న కుమారుడిగా పుట్టిన అతను నందీశ్వరుడిగా మారినట్లు పురాణాలు చెప్తున్నాయి.

నందీశ్వరునికి రుద్రుడు, మృదంగ వాద్య ప్రియుడు, శివ ప్రియుడు, వీర మూర్తి అని కూడా పిలుస్తారు. అందుకే ప్రదోష కాలంలో నందీశ్వరునికి తొలిపూజ చేస్తారు. నందీశ్వరుడి చెవుల్లో మన సమస్యలను చెప్పినట్టైతే ఆయన ఈశ్వరుని అనుగ్రహంతో తమ సమస్యలకు పరిష్కారం చేయిస్తారని విశ్వాసం. 
 
పాల సముద్రం చిలికేటప్పుడు.. వాసుకీ పాము నుంచి విషాన్ని మింగిన ఈశ్వరుడు.. నందీశ్వరుని కొమ్ముల మధ్య నర్తనమాడి.. విష ప్రభావాన్ని తగ్గించుకున్నట్లు పురాణాలు చెప్తున్నాయి. ఆ రోజునే ప్రదోషంగా జరుపుకుంటున్నారు. ఈ కారణంతోనే ప్రదోష పూజలో నందీశ్వరుడు తొలి అభిషేకం జరుగుతోంది.

ప్రదోషకాలంలో మహావిష్ణువు, బ్రహ్మతో పాటు ముక్కోటి దేవతలు శివాలయానికి విచ్చేస్తారని.. ఆ సమయంలో నందీశ్వరుడి అభిషేకాన్ని వీక్షించే వారికి సకల దోషాలు తొలగిపోతాయి. అంతేగాకుండా ముక్కోటి దైవాలను పూజించిన ఫలితం లభిస్తుంది.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

గురువారం (08-03-18) మీ రాశిఫలితాలు... ప్రతిభకు మంచి గుర్తింపు