అక్క‌డ పుట్టు మ‌చ్చ ఉంటే చాలా.. కోటీశ్వ‌రులు అయిపోతారా?

చేతి గీతలు, పుట్టు మచ్చలు చూసి మన జాతకాన్ని చెపుతుంటారు కొంద‌రు జోతిష్యులు. వీటిని మూఢనమ్మకాలని కొట్టిపారేశావారున్నారు. నమ్మేవాళ్లూ ఉన్నారు. శరీరంపై ఉండే పుట్టుమచ్చల ఆధారంగా మనకు కలిగే ప్రయోజనాల గురిం

గురువారం, 13 అక్టోబరు 2016 (17:31 IST)
చేతి గీతలు, పుట్టు మచ్చలు చూసి మన జాతకాన్ని చెపుతుంటారు కొంద‌రు జోతిష్యులు. వీటిని మూఢనమ్మకాలని కొట్టిపారేశావారున్నారు. నమ్మేవాళ్లూ ఉన్నారు. శరీరంపై ఉండే పుట్టుమచ్చల ఆధారంగా మనకు కలిగే ప్రయోజనాల గురించి తెల్సుకుందాం.
 
* పుట్టుమచ్చల మీద వెంట్రుకలు ఉన్న వారు ధనవంతులు, కీర్తివంతులు అవుతారు.
* మగాళ్లకు రెండు కనుబొమ్మల మధ్య పుట్టుమచ్చలు ఉంటే దీర్ఘాయుష్షు లభిస్తుంది.
* మగవారికి తలలో పుట్టుమచ్చలుంటే గర్వం ఎక్కువ. వారు ప్రతి అంశాన్ని విమర్శనాత్మకంగా గమనిస్తారు. మంచి ఆశాభావం గలవారు.
* నుదుటి మీద ఉంటే మంచి కీర్తి, ప్రతిష్టలు సాధిస్తారు. ఆర్థిక స్వతంత్రం ఉంటుంది. రాజకీయాల్లో రాణిస్తారు.
* నుదుటి కింది భాగంలో ఉంటే మంచి లక్ష్యాన్ని, ఏకాగ్రతను కలిగి ఉంటారు. 40 ఏళ్ల తర్వాత విజయం సాధిస్తారు.
* కనుబొమ్మపై ఉంటే కష్టపడి పని చేయాల్సి ఉంటుంది. కొంతమందికి మంచి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి.
* ముక్కుపై ఉంటే కొంతమందిలో క్రమశిక్షణ లోపిస్తుంది. చెవికి చెందిన ఏ భాగంలో ఉన్నా ధనం కనిపిస్తూ ఉంటుంది. సమాజంలో గౌరవంతో కూడిన గుర్తింపు ఉంటుంది.
* పెదవిపై ఉంటే కొన్నిసార్లు మీ బంధువులు, స్నేహితుల విషయంలో మీకు ఈర్ష్య కలుగుతుంది. 
* బుగ్గపై ఉంటే రాజకీయాల్లో రాణిస్తారు. స్థిరాస్తులు గడిస్తారు.
* నాలుకపై ఉంటే మీరు మంచి తెలివితేటలు, విద్యను కలిగి ఉంటారు. 
* గడ్డంపై ఉంటే ఆడ, మగ వారిలో భిన్నంగా ఫలితాలు ఉంటాయి. 
* గడ్డం మధ్యలో పుట్టు మ‌చ్చ ఉన్న మగవారు ఉదార గుణము కలిగి ఉంటారు. ఆడ వారికి భక్తిభావం మెండు. మంచి అదృష్టవంతులవుతారు.
* భుజంపై ఉంటే మర్యాదస్తులుగా ఉంటారు. కష్టపడి పనిచేసే స్వభావం కలిగి ఉంటారు. ఆనందకరమైన దాంపత్య జీవితం కొనసాగిస్తారు. 
* మోచేయిపై ఉంటే మీ జీవితంలోని లక్ష్యాలను చేరుకోవడంలో కొన్ని ఒడిదుడుకులు తప్పవు.
* ఎడమ బాహుమూల భాగంలో ఉంటే మీ ప్రారంభ జీవితంలో కొంత ఒడిదుడుకులున్నా తర్వాత నెమ్మదిగా సర్దుకుంటాయి. 
* కుడి బాహుమూల భాగంలో ఉంటే భద్రత విషయంలో మీరు చాలా మెళకువగా ఉంటారు. 
* మెడ భాగంలో ఉంటే కొన్ని సమయాల్లో మీకు దురదృష్టం తప్పదు. ఇతరులు మిమ్మల్ని మోసగించేందుకు ప్రయత్నిస్తారు.
 
* కుడి కనుబొమ మీద మచ్చ ఉన్నవారికి వివాహము త్వరిత గతిన అవుతుంది. 
* కుడి కంటి రెప్పపై పుట్టుమచ్చ ఉంటే సంపద కలుగుతుంది. వాహన సౌఖ్యం లభిస్తుంది. 
* మొత్తంగా ముఖానికి కుడి వైపున పుట్టుమచ్చలు కలిగిన పురుషులు అదృష్టవంతులుగా 
ఉంటారు. ఎడమవైపు పుట్టుమచ్చలు ఉంటే ఫలితాలు మిశ్రమంగా ఉంటాయి.
* శరీరం ముందు భాగంలో ఉంటే ఆకస్మిక ధన లాభం. 
* శరీరం వెనుక భాగంలో ఉంటే మీరు కష్టపడి పని చేసినా ఆ పేరు ఇతరులకు దక్కుతుంది.

వెబ్ దునియా తెలుగు వార్తలు, సినిమాతో పాటు మరిన్ని విశేషాల కోసం Mobile App డౌన్లోడ్ చేసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.
 

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం ఐదుగురికి భార్యలైనా ద్రౌపది పతివ్రతే... సందేహమా...? ఐతే చదవండి...