విజయ ఏకాదశి మార్చి 6, బుధవారం జరుపుకుంటున్నారు. సంవత్సరానికి మొత్తం 24 ఏకాదశి ఆచారాలు ఉన్నాయి. ప్రత్యర్థులపై విజయం సాధించడమే విజయ ఏకాదశి అని, ఈ పవిత్ర ఉపవాసాన్ని ఆచరించే వారు తమ లక్ష్యాన్ని సాధించే వరకు ఆగరు.
విజయ ఏకాదశి ఉపవాసం పురాణాలలో కూడా ప్రస్తావన ఉంది. పురాతన కాలంలో చాలా మంది రాజులు ఈ ఉపవాసం ప్రభావం వల్ల భీకర యుద్ధాలలో గెలిచారని చెబుతారు.
అత్యంత కఠినమైన యుద్ధాలను కూడా ఈ ఉపవాసంతో జయించవచ్చు. ఈ ఉపవాసం పాటించడం వల్ల పాపాలు, బాధలు తొలగిపోతాయి. విజయ ఏకాదశి ఉపవాసం పాటించే భక్తులు సాధారణంగా వీటికి దూరంగా ఉండాలి.
బియ్యం, గోధుమలు, పప్పుతో సహా అన్ని ధాన్యాలు, తృణధాన్యాలు.
ఉల్లిపాయలు, వెల్లుల్లి, బీన్స్ తీసుకోకూడదు. మాంసాహారం, మద్యం తీసుకోకూడదు.
పండ్లు, గింజలు, పాలు, కూరగాయలను తీసుకోవచ్చు. నీరు, పండ్ల రసాలను తాగడం ద్వారా ఉపవాసం వుండే వారు డీ- హైడ్రేటెడ్ నుంచి తప్పించుకోవచ్చు. ఇంకా రాత్రి పూట జాగరణ చేయడం మంచిది. సాయంత్రం పూట ఆలయాలను సందర్శించడం చేయవచ్చు. పెరుమాళ్ల స్వామి ఆలయంలో నేతిదీపం వెలిగించడం ద్వారా సర్వాభీష్టాలు చేకూరుతాయి.