శుక్రవారం వరలక్ష్మీ వ్రతం రోజున మంగళకర యోగం ఏర్పడింది. ఈ యోగంతో 12 రాశుల్లో కొన్ని రాశులకు అదృష్టం కలిసివస్తుంది. వరలక్ష్మి వ్రతాన్ని ఈ సంవత్సరం ఆగష్టు 16న జరుపుకుంటారు. ఈ శుభ దినాన అనేక శుభ యోగాలు ఏర్పడతాయి.
సాధారణంగా శ్రావణ మాసం శివునికి అంకితం. కానీ శ్రావణ శుక్రవారానికి విశిష్ఠ ఫలితం వుంటుంది. ఈ శుభ రోజున వరలక్ష్మి దేవికి విశేష పూజలు చేసారు. వరలక్ష్మి వ్రతాన్ని ప్రతి సంవత్సరం శ్రావణ పున్నమికి మునుపటి శుక్రవారం రోజు జరుపుకుంటారు.
ఈ రోజు లక్ష్మి దేవిని పూజించడం వల్ల లక్ష్మి దేవికి విశేషమైన అనుగ్రహం లభిస్తుంది. ఇంకా ఈ వ్రతాన్ని ఆచరించే వారి కుటుంబంలో ఆనందం, శాంతి, సమృద్ధి చేకూరుతాయని విశ్వాసం.
ఈ నేపథ్యంలో ఆగస్టు 16న జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ప్రేమ యోగం, విష్కుంభ యోగం, మహా శని మహా యోగం ఏర్పడ్డాయి. ఈ శుభ యోగాల సమయంలో, మిథున, కన్యారాశి సహా 5 రాశులు విశేష లాభాలను పొందుతాయి.
వృషభ రాశివారు.. వరలక్ష్మి వ్రత సమయంలో లక్ష్మిదేవి ఆశీర్వాదం పొందుతారు. ఈ సమయంలో మీరు ఆరోగ్య సమస్యలకు పరిష్కారం పొందుతారు. వైవాహిక సమస్యలు పరిష్కరించబడతాయి. మనశ్శాంతి లభిస్తుంది. వ్యాపారులు భవిష్యత్తులో మంచి లాభాలను పొందుతారు.
మిథున రాశివారు వరలక్ష్మి వ్రత సమయంలో శుభ ఫలాలను పొందుతారు. దంపతుల మధ్య సంబంధం బలపడుతుంది. ఆస్తిని కొనుగోలు చేస్తారు. వ్యాపారాల్లో వృద్ధి తప్పదు. భవిష్యత్తులో మీరు ఆర్థిక లాభం పొందే అవకాశం ఉంది. ప్రభుత్వ ఉద్యోగులకు కలిసివచ్చే కాలం.
కన్యా రాశి వారు వరలక్ష్మి వ్రతం రోజు ఏర్పడే యోగాల కారణంగా కుటుంబ జీవితంలో సంతోషాన్ని నింపుతాయి. ఈ సమయంలో అతిథులు మీ ఇంటికి వచ్చే అవకాశం ఉంది. మీ కుటుంబ సభ్యులలో వాత్సల్యం ఏర్పడుతుంది. షేర్లలో పెట్టుబడులు మంచి ఫలితాలు వచ్చాయి. ఈ సమయంలో ఆరోగ్యం గురించి ప్రత్యేక శ్రద్ధ వహించాలి. వ్యాపారులకు మంచి లాభం. ఒత్తిడి తగ్గుతుంది.
వృశ్చిక రాశి.. కొత్త వాహనాలు కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఇంట్లో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. విద్యార్థులు పాఠశాలల్లో ఏదైనా పోటీల్లో బహుమతులు గెలుచుకోవచ్చు. వ్యక్తిగత జీవితంలో సమస్యలు పరిష్కారమవుతాయి.
మకర రాశి వారికి వరలక్ష్మి వ్రతాలు కష్టాలకు తగిన ఫలితాలు వస్తాయి. వ్యాపారులకు మంచి లాభం లభిస్తుంది. కొత్త ఒప్పందాలను కుదుర్చుకుంటారు. ఉద్యోగస్తులు రాణిస్తారు. రుణాలు తీర్చుతారు.