Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

09-09-2024.. 999.. ఈ రోజున గ్లాసుడు నీటితో ఇలా చేస్తే..?

Advertiesment
Astrology

సెల్వి

, ఆదివారం, 8 సెప్టెంబరు 2024 (20:21 IST)
09-09-2024 అనే రోజు సోమవారం వస్తోంది. ఈ తేదీ చాలా అరుదు. ఈ సంఖ్య ప్రపంచం అంటే యూనివర్శ్‌కు చాలా ఇష్టమైనదని.. ఈ సంఖ్య అదృష్టాలను ఇస్తుంది. సంఖ్యా శాస్త్రం ప్రకారం 9 అదృష్టాలను సంతోషాన్ని ప్రసాదిస్తుంది. 
 
ఈ రోజున యూనివర్శ్ మనం అడిగిన కోరికలను నెరవేరుస్తుందని.. మేనిఫెస్టుకు ఇది అనువైన రోజని ఆధ్యాత్మిక, సంఖ్యా శాస్త్ర నిపుణులు అంటున్నారు. 9 అనే సంఖ్య నవగ్రహాలను, నవరాత్రులను సూచిస్తుంది. అలాంటి 09-09-2024న ఉదయం సరిగ్గా 09.09 గంటలకు అలాగే రాత్రి 09.09 గంటలకు ఇలా చేస్తే.. అనుకున్న కోరికలు ఇట్టే నెరవేరుతాయి. 
 
అలాగే మనకు జరగని కార్యాలు.. ఇక జరగదు అనుకుని నమ్మకం లేకుండా వదిలేసిన కార్యాలు పూర్తవుతాయని సంఖ్యా శాస్త్రం చెప్తుంది. సాధారణంగా మన ప్రయాణంలో 9 అనే సంఖ్య కంట్లో పడుతూ వుంటుంది. 9 లేదా 999 లేదంటే 9999 అనే సంఖ్య మీ కంటపడితే అదృష్టం మీ వెంటే వుందని విశ్వాసం. కష్టాలు తొలగిపోతాయని, విజయం వరిస్తుందని నమ్మకం. 
 
అందుకే సెప్టెంబర్ 9వ తేదీన ఉదయం లేదా రాత్రి 9.09 గంటలకు ఓ గ్లాసులో శుభ్రమైన నీటిని తీసుకుని.. ఆ గ్లాసులోని నీటిని చూపుడు వేలుతో టచ్ చేస్తే చాలు. అలా 9 నిమిషాల పాటు ఆ నీటిని తాకుతూ.. మనస్సులోని మీ కోరికలను నీటితో చెప్పడం.. పంచభూతాల్లో నీటికి వున్న శక్తి సంపదలను ఇస్తుంది. 
 
అలాంటి నీటిని తాకుతూ 9.09 గంటల ప్రాంతాల్లో మన కోరికలను చెప్తే తప్పక నెరవేరుతాయని సంఖ్యా శాస్త్ర నిపుణులు అంటున్నారు. కోరిన కోరికలు జరిగినట్లు వూహించుకుంటూ.. కోరికలు నెరవేరినట్లు భావించి తొమ్మిది నిమిషాలు అలానే వేలును నీటిలో వుంచాలి. 
webdunia
Water
 
నీటిలో చూపుడు వేలును వుంచడానికి ముందు చేతిని శుభ్రంగా వుంచుకోవడం ముఖ్యం. ఇలా చేస్తే తప్పకుండా సంఖ్యా శాస్త్రం, యూనివర్శ్ శక్తితో అనుకున్న విషయాలు తప్పక నెరవేరుతాయి. ఇది 9 అనే సంఖ్యకున్న బలమని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

"దురంత్ దేవ్" అని 108 సార్లు పలికితే చాలు.. కష్టాలన్నీ పరార్!