Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అక్టోబరు 3 మీ రాశి ఫలితాలు... ఒక్కోసారి మంచి చేసినా విమర్శలు తప్పవు

మేషం: వ్యాపార ఒప్పందాలు, స్థిరాస్తుల క్రయవిక్రయాల్లో అనుభవజ్ఞుల సలహా తీసుకోవడం ఉత్తమం. ఉద్యోగస్తులకు పై అధికారుల నుండి ఒత్తిడి అధికమవుతుంది. మీ చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ఖర్చులు అదుపుకోకపోగా మ

అక్టోబరు 3 మీ రాశి ఫలితాలు... ఒక్కోసారి మంచి చేసినా విమర్శలు తప్పవు
, బుధవారం, 3 అక్టోబరు 2018 (10:40 IST)
మేషం: వ్యాపార ఒప్పందాలు, స్థిరాస్తుల క్రయవిక్రయాల్లో అనుభవజ్ఞుల సలహా తీసుకోవడం ఉత్తమం. ఉద్యోగస్తులకు పై అధికారుల నుండి ఒత్తిడి అధికమవుతుంది. మీ చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ఖర్చులు అదుపుకోకపోగా మరింత ధనవ్యయం అవుతుంది. కుటుంబీకులతో కలసి వేడుకలలో పాల్గొంటారు.
 
వృషభం: మత్స్య, కోళ్ళ, గొర్రెల వ్యాపారస్తులకు కలిగిరాగలదు. పుణ్యక్షేత్రాల దర్శనం వలన మానసిక ప్రశాంతత చేకూరుతుంది. సాహస ప్రయత్నాలు విరమించండి. రహస్య విరోధులు అధికం కావడం వలన రాజకీయాల్లో వారికి ఆందోళన తప్పదు. బ్యాంకు వ్యవహారాలలో పరిచయం లేని వ్యక్తులతో మితంగా సంభాషించండి.
 
మిధునం: నిరుద్యోగులకు కీలకమైన వ్యవహారాలలో బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవలసి ఉంటుంది. స్త్రీలకు అవగాహన లేని విషయాల్లో తలదూర్చడం వలన ఇబ్బందులు తప్పవు. సోదరులతో కలిసి నూతన వ్యాపారాలకు శ్రీకారం చుడతారు. మీ ఉన్నతిని చూసి అసూయపడేవారు అధికమవుతున్నారని గమనించండి.
 
కర్కాటకం: దంపతుల మధ్య అవగాహన కుదరదు. మీ మేలు పొందిన వారే మీపై అభాండాలు వేసేందుకు యత్నిస్తారు. స్త్రీలు దైవ సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొని మార్పులు, చేర్పులు చేస్తారు. పనులు చేపట్టకుడా ప్రస్తుతం చేస్తున్న వాటిపైనే శ్రద్ధ వహించండి. గృహంలో మార్పులు, చేర్పులు చేస్తారు.
 
సింహం: ఆర్థికంగా ఎదగాలనే మీ ఆశయం నిదానంగా ఫలిస్తుంది. ఆకస్మికంగా బిల్లులు, ఫీజులు చెల్లిస్తారు. రావలసిన ధనం కొంత ముందు వెనుకలుగానైనా అందుతుంది. ఎప్పటి నుండో వాయిదా పడుతూవస్తున్న పనులు పునఃప్రారంభించాలనే ఆలోచన స్పురిస్తుంది. ఏదైనా స్థిరాస్తి కొనుగోలు చేయాలనే ఆలోచన స్పురిస్తుంది.
 
కన్య: స్త్రీలకు సంగీత, సాహిత్య కార్యక్రమాలు ఆహ్వానం అందుతుంది. ప్రింటింగ్ రంగాల వారికి బాకీల వసూళ్ళలో శ్రమాధిక్యత, ప్రయాసలు తప్పవు. స్టాక్‌మార్కెట్ రంగాలవారి అంచనలా ఫలిస్తాయి. ఒక్కోసారి మంచి చేసిన విమర్శలు తప్పవు. కుటుంబీకులతో కలిసి దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.
 
తుల: దైవా, సేవా కార్యక్రమాల్లో ప్రముఖంగా వ్యవహరిస్తారు. ఖర్చులు అధికం. సోదరుల సహకారంలతో ఓ సమస్యను సునాయసంగా పరిష్కరిస్తారు. కుటుంబ, ఆర్థిక సమస్యలు ఒక కొలిక్కి వస్తాయి. నిత్యావసర వస్తు స్టాకిస్టులకు, వ్యాపారులకు సంతృప్తి కానవస్తుంది. కష్టసమయంలో సన్నిహితులకు అండగా నిలుస్తారు.
 
వృశ్చికం: గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. ఎదుటివారి తీరును గమనించి వ్యవహరించండి. ఏదైనా అమ్మకానికై చేయు ప్రయత్నాలు ఫలించగలవు. గతంలో వాయిదా వేసిన పనులు పునఃప్రారంభిస్తారు. ఇసుకు, క్యారీ కాంట్రాక్టర్లకు ఆశాభంగం. ధనం విపరీతంగా వ్యయం చేసే మీ ధోరణిని మార్చుకోవడం శ్రేయస్కరం.
 
ధనస్సు: ఆర్థిక వ్యవహారాలలో భాగస్వామి వైరి మనస్తాపం కలిగిస్తుంది. వ్యాపార రంగాలలో వారికి గణనీయమైన పురోభివృద్ధి. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కుంటారు. నిరుద్యోగులకు సదవకాశాలు లభించినా సద్వినియోగం చేసుకోలేరు. ట్రాన్స్‌పోర్ట్, ఎక్స్‌పోర్ట్, ట్రావెలింగ్ రంగాల్లో వారికి కలిసిరాగలదు.
 
మకరం: వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కుంటారు. ప్రముఖులను కలిసి శుభాకాంక్షలు అంజేస్తారు. స్త్రీలకు బంధువులతో మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. దూర ప్రయాణాలలో ఇబ్బందులను ఎదుర్కుంటారు. ఆకస్మిక ఖర్చులు, తప్పనిసరి చెల్లింపులు ఆందోళన కలిగిస్తాయి. స్పెక్యులేషన్ కలిసిరాదు.
 
కుంభం: ఫర్నీచర్ అమరికలకు అవసరమైన నిధులు సమకూర్చకోవడంలో ఇబ్బందులు ఎదుర్కుంటారు. సాహిత్యభిలాష పెరుగుతుంది. వాతావరణంలోని మార్పు మీకు ఎంతో ఆందోళన కలిగిస్తుంది. కొత్త రుణాలు కోసం అన్వేషిస్తారు. దంపతుల మధ్య కొత్త కొత్త విషయాలు చర్చకు వస్తాయి. స్త్రీలకు పనిభారం అధికమవుతుంది.
 
మీనం: అలౌకిక వ్యవహారాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. దుబారా నివారించలేకపోవుట వలన ఆందోళన చెందుతారు. నూతన వ్యాపారులకు పెట్టుబడులు పెడుతారు. మీ అభిరుచికి తగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడుతాయి. మీరు తలపెట్టిన పనిలో ప్రోత్సాహం లభిస్తుంది. ఉపాధ్యాయులు విశ్రాంతిని పొందలేకపోతారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మనిషి చెప్పే మూడు అబద్ధాలు ఏమిటి?