రాశి ఫలితాలు (17-06-2017).... నూతన వ్యక్తుల పరిచయం
మేషం గృహోపకరణాలను కొనుగోలు చేస్తారు. కోర్టు వ్యవహారాలు వాయిదాపడుట మంచిది. పేరు, ప్రఖ్యాతులు గడిస్తారు. ధర్మకార్యాలయందు ఆసక్తి పెరుగుతుంది. కుటుంబంలో మార్పులు జరిగే అవకాశాలు ఉన్నాయి. తలచిన కార్యాలు ఆలస్యంగా అమలుపరుస్తారు. పరస్త్రీలతో జాగ్రత్తగా ఉండుట
మేషం
గృహోపకరణాలను కొనుగోలు చేస్తారు. కోర్టు వ్యవహారాలు వాయిదాపడుట మంచిది. పేరు, ప్రఖ్యాతులు గడిస్తారు. ధర్మకార్యాలయందు ఆసక్తి పెరుగుతుంది. కుటుంబంలో మార్పులు జరిగే అవకాశాలు ఉన్నాయి. తలచిన కార్యాలు ఆలస్యంగా అమలుపరుస్తారు. పరస్త్రీలతో జాగ్రత్తగా ఉండుట మంచిది.
వృషభం
వ్యాపారంలో అధిక లాభాలను గడిస్తారు. విజ్ఞాన విహార యాత్రల పట్ల ఏకాగ్రత వహిస్తారు. ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాలలో తొందరపాటుతనం విడనాడండి. అవివాహితులకు త్వరలోనే దూర ప్రాంతాల నుండి సంబంధాలు ఖాయమవుతాయి. ప్రింటింగ్ రంగాల వారికి బకాయిల వసూళ్ళలో శ్రమాధిక్యత, ప్రయాసలు తప్పవు.
మిథునం
అనుకోని కలహాలకు అవకాశం ఉంటుంది. ఊహించని ఖర్చులు అధికమవుతాయి. ఆరోగ్యంలో చిన్నచిన్న సమస్యలు తలెత్తినా సమసిపోతాయి. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. ఆలయ సందర్శనాలలో ఇబ్బందులను ఎదుర్కొంటారు. విద్యుత్ లోపం వల్ల చికాకులకు లోనవుతారు. వైద్యుని సలహా తీసుకోండి.
కర్కాటకం
చిన్ననాటి వ్యక్తుల కలయిక సంతోషం కలిగిస్తుంది. దూర ప్రయాణాలలో ధనం పోయే ఆస్కారం ఉంది. జాగ్రత్త వహించండి. పానీయ, కొబ్బరి వ్యాపారస్తులకు కలిసివస్తుంది. బంధువుల రాకతో మీకు ఎంతో సంతృప్తినిస్తుంది. రావలసిన ధనం కొంత ముందు వెనుకలుగానైనా అందుతుంది.
సింహం
ప్రయాణాలలో జాగ్రత్త అవసరం. ఒక వ్యక్తి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నిస్తారు. ప్రభుత్వ రంగాలలోవారికి, గృహంలో మార్పులు చేర్పులు ఇది సరైన సమయం. నిరుద్యోగులకు రాత, మౌఖిక పరీక్షలలో ఏకాగ్రత అవసరం. హోటల్, కేటరింగ్ రంగాల్లో వారు పనివారితో ఇబ్బందులు ఎదుర్కొంటారు.
కన్య
కాంట్రాక్టర్లకు కలిసిరాగలదు. పెద్దలను, ప్రముఖులను కలుసుకుంటారు. వాగ్దానాలు చేసి సమస్యలను ఎదుర్కొంటారు. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. వాతావరణంలోని మార్పు మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. వ్యవసాయ తోటల రంగాల వారికి కొబ్బరి, పండ్ల పానీయ వ్యాపారులకు కలిసిరాగలదు.
తుల
రియల్ ఎస్టేట్, బ్రోకర్లు ఆశించినంత ఫలితాలు ఉండవు. రుణం ఏ కొంతైనా తీర్చుతారు. మీ హావభావాలు, ఆలోచనలు, బయటికి వ్యక్తం చేయకండి. మిమ్మల్ని ఉద్రేకపరచి లబ్ది పొందడానికి ప్రయత్నిస్తారు. అపుడప్పుడు కళ్లు, తల, నరాలకు సంబంధించిన చికాకులు అధికమవుతాయి. విద్యార్థునిలకు పురోభివృద్ధి.
వృశ్చికం
వాహనచోదకులకు చిన్నచిన్న సమస్యలు తలెత్తుతాయి. దూర ప్రయాణాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. హామీలు ఉండి సమస్యలు తెచ్చుకోకండి. ప్రభుత్వ మూలకంగా ఇబ్బందులు ఎదురవుతాయి. ధనకాంక్ష అధికమవ్వడం వల్ల సమస్యలను ఎదుర్కొంటారు. వస్త్రం, వెండి, బంగారు, లోహ వ్యాపారస్తులకు ఆశాజనకం.
ధనస్సు
స్త్రీలకు మనోధైర్యం తగ్గుతుంది. ప్రభుత్వ రంగ సంస్థలలోని వారికి రాబడి పెరుగుతుంది. దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆల్కహాలు, మందులు, ఎరువులు ఫ్యాన్సీ వ్యాపారస్తులకు కలిసివస్తుంది. స్థిర చరాస్తుల పట్ల ఏకాగ్రత వహిస్తారు. చేతి పనివారికి వృత్తుల వారికి లాభదాయంగా ఉండగలదు.
మకరం
కాంట్రాక్టర్లకు అధికారుల నుంచి అభ్యంతరాలెదుర్కోవలసి వస్తుంది. కోర్టు వ్యవహారాలు వాయిదాపడుట మంచిది. ఆలయాలను సందర్శిస్తారు. హోటల్ తినుబండారు వ్యాపారులకు సంతృప్తికరంగా ఉంటుంది. అధిక శ్రమ, తిప్పట వంటివి ఎదుర్కొంటారు. క్రీడారంగంలోని వారికి సత్ఫలితాలు ఉండగలవు.
కుంభం
టెక్నికల్, ఎలక్ట్రానిక్, కంప్యూటర్ రంగాల్లో వారికి ఒత్తిడి తప్పదు. ముఖ్యులకు బహుమతులను అందజేస్తారు. ఎదుటివారితో సత్సంబంధం బాంధవ్యాలు కొనసాగించండి. కిరాణా, ఫ్యాన్సీ, మందులు, రసాయన సుగంధ ద్రవ్య వ్యాపారులకు సంతృప్తి, పురోభివృద్ధి. నూతన వ్యక్తుల పరిచయం మీకు ఎంతో సంతృప్తినివ్వగలదు.
మీనం
కిరణా, హోటల్, తినుబండరాల వ్యాపారస్తులకు సంతృప్తికరంగా ఉంటుంది. పెద్దల సలహాను పాటించి మీ గౌరవాన్ని నిలబెట్టుకుంటారు. రావలసిన ధనం సకాలంలో అందుతుంది. డాక్టర్లు ఆపరేషన్లు విజయవంతంగా పూర్తి చేస్తారు. అనురాగ వాత్సల్యాలు పొందుతారు. ఎదుటివారిని తక్కువ అంచనా వేసి మాట్లాడకండి.