Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

రాశి ఫలితాలు(15-06-17)... శ్రీమతికి అన్ని విషయాలు తెలియజేయండి

మేషం : ఉద్యోగ, వ్యాపార ప్రకటనలపై అవగాహన చాలా అవసరం. మీ శ్రీమతికి అన్ని విషయాలు తెలియజేయండి. స్టాక్ మార్కెట్ రంగాల వారి అంచనాలు నిరుత్సాహపరుస్తాయి. కీలకమైన వ్యవహారాలు మీ జీవిత భాగస్వామికి తెలియజేయడం అన్ని విధాలా శ్రేయస్కరం. తరచూ దైవ, సేవా కార్యక్రమాల్

రాశి ఫలితాలు(15-06-17)... శ్రీమతికి అన్ని విషయాలు తెలియజేయండి
, బుధవారం, 14 జూన్ 2017 (21:02 IST)
మేషం : ఉద్యోగ, వ్యాపార ప్రకటనలపై అవగాహన చాలా అవసరం. మీ శ్రీమతికి అన్ని విషయాలు తెలియజేయండి. స్టాక్ మార్కెట్ రంగాల వారి అంచనాలు నిరుత్సాహపరుస్తాయి. కీలకమైన వ్యవహారాలు మీ జీవిత భాగస్వామికి తెలియజేయడం అన్ని విధాలా శ్రేయస్కరం. తరచూ దైవ, సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు.
 
వృషభం : వ్యాపారాభివృద్ధికి చేయు కృషిలో రాణిస్తారు. దంపతుల మధ్య దాపరికం మంచిది కాదు. నిరుద్యోగులు ఇంటర్వ్యూలలో ఏకాగ్రత వహించిన సత్ఫలితాలు పొందగలరు. మీ యత్నాలకు ఆటంకాలు తొలగిపోయి పనులు సానుకూలమవుతాయి. విద్యుత్, ఏసీ కూలర్లు, మెకానిక్ రంగాల్లో వారికి సంతృప్తి కానవస్తుంది. 
 
మిథునం : అందివచ్చిన అవకాశం చేజారినా ఒకందుకు మంచిదే అనిపిస్తుంది. స్త్రీలకు స్వీయ సంపాదన పట్ల ఆసక్తి అధికమవుతుంది. కుటుంబంలో ప్రశాంత వాతావరణం నెలకొంటుంది. సోదరుల మధ్య సఖ్యత అంతగా వుండదు. విందులలో పరిమితి పాటించండి. వ్యాపార అభివృద్ధికి కొత్త పథకాలు అమలు చేస్తారు. 
 
కర్కాటకం: ఆర్థిక లావాదేవీలు, కీలకమైన వ్యవహారాల్లో ఏకాగ్రత వహించండి. మీరెంత శ్రమించినా గుర్తింపు అంతంతమాత్రంగానే వుంటుంది. కొన్ని విషయాల్లో మిత్రులు మీ అభిప్రాయాలను వ్యతిరేకిస్తారు. కాంట్రాక్టర్లకు నిర్మాణ పనులలో ఏకాగ్రత చాలా అవసరం. నోరు అదుపులో పెట్టుకోవడం ఎంతో శ్రేయస్కరం. 
 
సింహం: మీ తొందరపాటు నిర్ణయాలు ఇబ్బందులకు దారితీస్తాయి. గతంలో జరిగిన తప్పుల నుంచి మంచిని నేర్చుకోండి.  ప్రత్యర్థులతో జాగ్రత్త. కొన్ని పనులు విసుగు కలిగించినా మొండిగా పూర్తి చేస్తారు. అకాల భోజనం, శారీరక శ్రమ వల్ల ఆరోగ్యం మందగిస్తుంది. విదేశీయానం కోసం చేసే యత్నాలు ఫలిస్తయి.
 
కన్య : వృత్తుల వారికి సదవకాశాలు లభిస్తాయి. నూతన ప్రదేశాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. భాగస్వామిక చర్చల్లో మీ ప్రతిపాదనలకు మిశ్రమ స్పందన వుంటుంది. ఉద్యోగస్తులకు పనిభారం అధికమవుతుంది. వాహనం ఇతరులకు ఇచ్చే విషయంలో లౌక్యంగా వ్యవహరించండి. మిమ్మల్ని పొగిడే వారే కానీ సహకరించేవారు వుండరు.
 
తుల : రచయితలకు, పత్రికా రంగంలో వారికి కీర్తి, గౌరవాలు పెరుగుతాయి. ఖర్చులు పెరగటంతో రుణ యత్నాలు, చేబదుళ్లు తప్పవు. కొంతమంది మీ ఆలోచనలను తప్పుదారి పట్టించే ఆస్కారం వుంది. మెలకువ వహించండి. రాజకీయనాయకులు సభలు, సమావేశాలలో హుందాగా వ్యవహరించి అందరినీ ఆకట్టుకుంటారు. 
 
వృశ్చికం : భాగస్వామిక వ్యాపారాల నుంచి విడిపోయి సొంతంగా ఏదైనా చేయాలనే ఆలోచనకు వస్తారు. దూరపు బంధువుల నుంచి ఒక ముఖ్య సమాచారం అందుతుంది. కార్యసాధనలో శ్రమాధిక్యత, ఆటంకాలు ఎదుర్కొంటారు. స్త్రీలతో మితంగా సంభాషించడం శ్రేయస్కరం. ఉద్యోగస్తుల సమర్థతను అధికారులు గుర్తిస్తారు. 
 
ధనుస్సు : ఉద్యోగస్తులు కోరుకున్న చోటికి బదిలీ అవుతారు. మీ చిన్నారుల కోసం నూతన పథకాలు వేసి జయం పొందగలుగుతారు. ఎప్పటి సమస్యలను అప్పుడు పరిష్కరించుకోవడం శ్రేయస్కరం. మీ సిఫార్సుతో ఒకరికి చక్కని అవకాశం లభిస్తుంది. స్త్రీలు ఆభరణాలు, విలువైన వస్తువులు సమకూర్చుకుంటారు. 
 
మకరం : చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. రావలసిన ధనం అందడంతో ఒత్తిడి, ఆందోళనలు తొలగిపోతాయి. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలలో జయం చేకూరుతుంది. మీ విషయాల్లో ఇతరుల జోక్యానికి తావివ్వవద్దు. దైవ, సేవా పుణ్యకార్యాల్లో పాల్గొంటారు. సమయానుకూలంగా మీ కార్యక్రమాలు మార్చుకుంటారు.  
 
కుంభం :  ఆదాయ వ్యయాలకు పొంతన వుండదు. విద్యార్థులు ఉన్నత విద్యల కోసం దూర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తుంది. ఆత్మీయుల గురించి ఆందోళన చెందుతారు. షేర్ల క్రయవిక్రయాలు అనుకలిస్తాయి. ప్రేమికుల అతి ఉత్సాహం అనర్థాలకు దారితీస్తుంది. సభలు, సమావేసాల్లో ప్రముఖంగా వ్యవహరిస్తారు.
 
మీనం : ఆర్థిక పరిస్థితి కొంతమేరకు మెరుగుపడుతుంది. విద్యార్థుల మొండివైఖరి ఉపాధ్యాయులకు చికాకు కలిగిస్తుంది. వ్యాపారాభివృద్ధికి చేపట్టిన పథకాలు, ప్రణాళికలు సత్ఫలితాలనిస్తాయి. స్త్రీలు ఆత్మీయుల నుంచి ఒక ముఖ్య సమాచారం అందుకుంటారు. ఖర్చులు, చెల్లింపుల విషయంలో ఏకాగ్రత వహించండి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆస్తులు సంపాదించలేకపోయినా పర్లేదు- పుణ్యం కూడగట్టుకోండి.. పితృదేవతలను అలా పూజిస్తే?