Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అలాంటి వారు తమ తల లేని నీడను చూస్తారట...

ప్రతి ఒక్కరిని వణికించే పదం మరణం. పుట్టిన ప్రతి ఒక్కరు మరణించక తప్పదు. ఎవ్వరు చావు నుండి బయటపడలేరు. శివ పురాణం ప్రకారం పరమేశ్వరుడిని మరణానికి వచ్చే సూచన ఏమిటి అని పార్వతిదేవి అడిగింది. ఒక వ్యక్తి మరణించే సమయంలో ఏం జరుగుతుందని శివుడిని పార్వతి దేవి ప్

Advertiesment
అలాంటి వారు తమ తల లేని నీడను చూస్తారట...
, శుక్రవారం, 15 సెప్టెంబరు 2017 (12:52 IST)
ప్రతి ఒక్కరిని వణికించే పదం మరణం. పుట్టిన ప్రతి ఒక్కరు మరణించక తప్పదు. ఎవ్వరు చావు నుండి బయటపడలేరు. శివ పురాణం ప్రకారం పరమేశ్వరుడిని మరణానికి వచ్చే సూచన ఏమిటి అని పార్వతిదేవి అడిగింది. ఒక వ్యక్తి మరణించే సమయంలో ఏం జరుగుతుందని శివుడిని పార్వతి దేవి ప్రశ్నించింది. దీంతో శివుడు ఇలా చెప్పినట్లు పురాణాలు చెబుతున్నాయి.
 
ఒక వ్యక్తి యొక్క శరీరం లేత పసుపు, తెలుపు లేదా కొద్దిగా ఎర్రగా మారినప్పుడు ఆ వ్యక్తి ఆరు నెలల లోపల మరణిస్తాడని చెప్పారట. ఒక వ్యక్తి నూనెలో, నీళ్ళలో, లేదా అద్దంలో తమ ప్రతిబింబాన్ని చూసినప్పుడు కనిపించకపోతే ఆరునెలల్లో మరణిస్తాడని చెప్పారట. ఎవరైతే చనిపోయే సమయం కంటే ఒక నెల ఎక్కువగా జీవిస్తారో వారు అస్సలు వారి సొంత నీడను చూడలేరని చెప్పారట. ఒకవేళ చూసినా వారు తలలేని నీడను చూస్తారట. 
 
ఒక వ్యక్తి నాలుక అకస్మాత్తుగా ఉబ్బినా, దంతాల నుంచి చీము పడుతున్నా వారు ఐదునెలల కన్నా ఎక్కువ కాలం జీవించరని చెప్పారట. వ్యక్తి యొక్క ఎడమ చెయ్యి వారం రోజుల పాటు గట్టిగా పట్టేసినట్లు ఉన్నా, లేకుంటే నరాల బిగుసుకుని ఉన్నా ఆ వ్యక్తి నెలకన్నా ఎక్కువ రోజులు బతకడని చెప్పారట. వ్యక్తి ఏది చూసినా ప్రతిదీ నల్లగా కనిపిస్తే ఆ వ్యక్తి చావు దగ్గరలో ఉన్నట్లేనట. అలాగే చంద్రుడు, సూర్యుడు, అగ్ని యొక్క వెలుగును చూడలేకున్నా, వ్యక్తి ఆకాశంలోని దృఢ నక్షత్రాన్ని చూడలేకున్నా, సూర్యుడు, చంద్రుడు, ఆకాశాన్ని చూసినప్పుడు ఎర్రగా కనిపిస్తే ఆ వ్యక్తి కూడా ఆరు నెలలకు మించి బతకడని శివుడు పార్వతికి చెప్పారట.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శుభోదయం : ఈ రోజు మీ రాశి ఫలితాలు 15-09-17