Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

26న సూర్యగ్రహణం.. 16 ఏళ్లకు కేతుగ్రస్త గ్రహణం.. కన్య, ధనుస్సు రాశివారికి?

Advertiesment
26న సూర్యగ్రహణం.. 16 ఏళ్లకు కేతుగ్రస్త గ్రహణం.. కన్య, ధనుస్సు రాశివారికి?
, మంగళవారం, 24 డిశెంబరు 2019 (14:25 IST)
డిసెంబర్ 26వ తేదీన ఈ ఏడాదిలో చివరి గ్రహణం ఏర్పడుతోంది. భూమి, చంద్రుడు, సూర్యుడు ఒకే సరళరేఖపై రావడం వల్ల గ్రహణాలు ఏర్పడుతాయి.  భూమికి ఇరువైపులా సూర్యుడు, చంద్రులు సంచరిస్తుంటారు. మధ్యలో భూమి ఉంటుంది.

ఈ మూడూ ఒకే సరళరేఖపైకి చంద్రుడి మధ్యలో ఉండి ఆ ఆ నీడ సూర్యుడిపై పడి పాక్షికంగా గానీ, పూర్తిగా గానీ కనిపించకపోవడాన్ని సూర్యగ్రహణం అంటారు. ఇది అమావాస్య రోజున సంభవిస్తుంది. కానీ, అన్ని అమావాస్యల్లో సూర్యగ్రహణాలు ఏర్పడవు. సాధారణంగా సంవత్సరానికి ఐదు నుంచి ఏడు గ్రహణాలు ఏర్పడతాయి. 
 
ప్రతి పదేళ్లకు గ్రహణాలు ఏ వరుస క్రమంలో ఏర్పడ్డాయో అదే వరుస క్రమం పునరావృతం అవుతుంది. కానీ ఈసారి ఏర్పడే కంకణాకార కేతుగ్రస్త గ్రహణం తిరిగి 16 ఏళ్ల తర్వాత సంభవించనుంది. సూర్యహణం మార్గశిర బహుళ చతుర్దశి మూల నక్షత్రం ధనుస్సు రాశిలో ఏర్పడుతుంది. కాబట్టి కర్కాటకం, తుల, కుంభం, మీన రాశుల వారికి శుభం.. మేషం, వృషభ, మిథున, సింహ రాశుల వారికి మధ్యమంగా వుంటుంది. కానీ కన్య, వృశ్చిక, ధనుస్సు, మకర రాశుల వారికి ప్రతికూల ఫలితాలు ఉంటాయని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు.
 
గ్రహణం పట్టగానే నదీ స్నానం ఆచరించి, నదీ తీరాన జపం చేసుకుంటే ఫలితం ఎక్కువగా ఉంటుందని అంటారు. గ్రహణ స్పర్శ కాలంలో నదీస్నానం, మధ్యకాలమున తర్పణం, జపం, హోమం, దేవతార్చన, విడుపు కాలంలో దానం, స్నానం చేయడం మంచిది. గ్రహణ కాలంలో భాగవన్నామస్మరణ చేయటం ఉత్తమం. గురువు ఉపదేశించిన మంత్ర జపం, వశీకరణం, శత్రుపీడనం నుంచి విముక్తి లభించేందుకు, మనసు ప్రశాంతంగా ఉండేందుకు గాయత్రి మంత్ర జపం, ఏడురోజుల వరకు తప్పనిసరిగా ఆచరించాలి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పెళ్ళి కూతురికి మంగళస్నానాలు ఎందుకు చేయిస్తారో తెలుసా..?