తూర్పు దిక్కు శుభారంభానికి ప్రతీక. ఈ దిశలో ఎలాంటి శుభకార్యాన్నైనా ఆరంభిస్తే.. మంచి ఫలితాలుంటాయి. ఉదయం నిద్రలేచిన వెంటనే తూర్పు దిక్కు వైపు దేవతా ఫోటోలను చూడటం ద్వారా, ఆ దేవతలను నమస్కరించడం ద్వారా శుభాలు చేకూరుతాయి.
నిద్రలేచిన వెంటనే తూర్పు వైపున నాలుగైదు అడుగులేయడం మంచిది. దంతాలను శుభ్రం చేసేటప్పుడు తూర్పు దిశ వైపు బ్రష్ చేస్తూ మధ్య వేలును ఉపయోగించడం మంచింది.
స్నానం చేసేటప్పుడు కూడా తూర్పు దిశగా నిల్చుని చేయడం ద్వారా ఆయురారోగ్యాలు చేకూరుతాయి. అలాగే శుచిగా స్నానమాచరించి తూర్పు దిశవైపు కూర్చుని పూజలు చేయడం ద్వారా అష్టైశ్వర్యాలు చేకూరుతాయి.
ముఖ్యంగా సూర్య నమస్కారం చేయడం ద్వారా ఈతిబాధలన్నీ తొలగిపోతాయి. నిద్రలేచిన తర్వాత తూర్పు వైపునున్న తలుపులు, కిటికీలు తెరవడం చేయాలని ఆధ్యాత్మిక పండితులు సూచిస్తున్నారు.