ఒకే ఒక్క మంత్రంతో సంతాన ప్రాప్తి... ఏంటది?

వివాహమై కొన్ని సంవత్సరాలవుతున్నా చాలామందికి సంతానం కలుగకుండా ఇబ్బంది పడుతుంటారు. అలాంటి వారు వెళ్ళని ఆలయమంటూ ఉండదు. అలాంటి వారు ఒక చిన్న మంత్రంతో సంతానాన్ని పొందవచ్చని జ్యోతిష్యులు చెబుతున్నారు.

మంగళవారం, 5 సెప్టెంబరు 2017 (19:12 IST)
వివాహమై కొన్ని సంవత్సరాలవుతున్నా చాలామందికి సంతానం కలుగకుండా ఇబ్బంది పడుతుంటారు. అలాంటి వారు వెళ్ళని ఆలయమంటూ ఉండదు. అలాంటి వారు ఒక చిన్న మంత్రంతో సంతానాన్ని పొందవచ్చని జ్యోతిష్యులు చెబుతున్నారు.
 
సంతానం కోసం ఫాల్గుణ మాసంలో వచ్చే చవితి రోజు పుత్ర గణపతి వ్రతం చేయాలి. వ్రతం చేసే సమయంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉపవాసం ఉండాలి. ఒకవేళ ఆరోగ్యం సహకరించకుండా ఉండేవారు కటిక ఉపవాసం చేయాల్సిన అవసరం లేదు. అలాంటి వారు పచ్చి నువ్వులు, బెల్లం కొద్దిగా తిని ఉపవాసం ఉండవచ్చు. 
 
గణపతికి ఉపవాసం ఉండి సాయంత్రం అష్టదళాలైన ముగ్గు వేసి అక్కడ గులాబీ రంగు పట్ట పరిచి దానిపై కలశాన్ని ఏర్పాటు చేసి గణపతి ప్రతిమను పెట్టిన తరువాత బాలసూర్యం దేవం.. మహాగణాధిపతిం అనే మంత్రంతో పుత్ర గణపతిని పూజిస్తే సంతానం లేని వారి సమస్యలు తీరిపోతాయని జ్యోతిష్యులు చెబుతున్నారు.

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం బుధవారం పచ్చరంగు దుస్తులు ధరించండి.. యాలకుల్ని, హల్వాను?