అమావాస్య పూజ చేయాల్సిందేనా? పితృదేవతలకు శ్రాద్ధం ఇవ్వాల్సిందేనా?

అమావాస్య పూజ చేయడం శుభ ఫలితాలను ఇస్తుంది. ఇంకా జీవితంలో సుఖసంతోషాలను ప్రసాదిస్తుంది. పితృదేవతలు మన శ్రేయస్సును కోరుకుంటారు కాబట్టి.. అమావాస్య రోజున వారికి పిండ ప్రదానం చేయాలి. లేకుంటే కనీసం నీరైన వదలా

శనివారం, 8 ఏప్రియల్ 2017 (17:01 IST)
అమావాస్య పూజ చేయడం శుభ ఫలితాలను ఇస్తుంది. ఇంకా జీవితంలో సుఖసంతోషాలను ప్రసాదిస్తుంది. పితృదేవతలు మన శ్రేయస్సును కోరుకుంటారు కాబట్టి.. అమావాస్య రోజున వారికి పిండ ప్రదానం చేయాలి. లేకుంటే కనీసం నీరైన వదలాలి. ఇంట్లో పూజగదిని శుభ్రం చేసుకుని పితృదేవతలకు భోజనాన్ని నైవేద్యంగా సమర్పించాలి. ఈ అన్నంలో కాస్త కాకులకు ఉంచాలి. ఇలా ఉంచడం ద్వారా అమావాస్య రోజున కాకుల రూపంలో పితృదేవతలు మనం ఉంచిన ఆహారాన్ని తీసుకుంటారని నమ్మకం. 
 
ఇలా ప్రతి అమావాస్యకు పితృదేవతలకు పిండాలు పెడితే వారు సంతోషిస్తారు సాధారణంగా పితృదేవతలు ఏడుగణాలుగా వుంటారని.. తొలి మూడు గణాల దేవతలు అమూర్తులుగా.. అంటే ఆకారం లేనివారుగా ఉంటారని శాస్త్రాలు చెప్తున్నాయి. మిగిలిన నాలుగు గణాలైన వారికి మాత్రం ఆకారాలుంటాయి. పితృగణాలు దేవుళ్లతో కలిసి శ్రాద్ధాన్ని భుజిస్తాయని, భోజనంతో సంతృప్తి చెంది శ్రాద్ధదాతకు సుఖ, సంతోషాలను ప్రసాదిస్తాయని ధర్మశాస్త్రాలు చెప్తున్నాయి.
 
పితృదేవతలు దేవతాగణంలో ఏడు విభాగాలుగా వీరు వుంటారట. పితృదేవతలను సుఖంగా ఉంచుకుంటే... తప్పకుండా అష్టైశ్వర్యాలు లభిస్తాయని, ఈతిబాధలు ఉండవని శాస్త్రాలు చెప్తున్నాయి. అందుకే అమావాస్య రోజున మధ్యాహ్నం 12 గంటల్లోపు పితృదేవతలను పూజించి వారి శ్రాద్ధం ఇవ్వాలని పండితులు చెప్తున్నారు. 

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం శ్రీవారి భక్తులకు శుభవార్త - ఆన్‌లైన్‌లో అందుబాటులో 58,067 టిక్కెట్లు...