సప్త చిరంజీవి శ్లోకాన్ని పుట్టినరోజు నాడు చదివితే..?
సప్త చిరంజీవి శ్లోకాన్ని పుట్టినరోజు నాడు చదవాలని పండితులు చెప్తున్నారు. పుట్టిన రోజునాడు ఆవు పాలు, బెల్లము, నల్లనువ్వులు కలిపిన మిశ్రమాన్ని నివేదన చేసి ఈ క్రింది శ్లోకం చదివి తీర్ధంగా మూడు సార్లు తీస
సప్త చిరంజీవి శ్లోకాన్ని పుట్టినరోజు నాడు చదవాలని పండితులు చెప్తున్నారు. పుట్టిన రోజునాడు ఆవు పాలు, బెల్లము, నల్లనువ్వులు కలిపిన మిశ్రమాన్ని నివేదన చేసి ఈ క్రింది శ్లోకం చదివి తీర్ధంగా మూడు సార్లు తీసుకోవడం ద్వారా అపమృత్యు దోషం తొలుగుతుంది.
సప్త చిరంజీవి శ్లోకం :
అశ్వత్థామ, బలిర్వర్యాసో, హనుమాంశ్చ విభీషణ !
కృపః పరశురామశ్చ సప్తైతే చిరజీవనః !!
సప్తైతాన్ సంస్మరేన్నిత్యమ్ మార్కండేయ యథాష్టమమ్!
జీవేద్వర్శశతమ్ ప్రాజ్ఞః అపమృత్యు వివర్జితః !!
చిరంజీవులు అంటే చిరకాలం జీవించి వుండేవారని అర్థం. కానీ అంతం లేని వారని కాదు. శాశ్వత కీర్తి కలిగిన వారే చిరంజీవులు. అశ్వత్థామా, బలిచక్రవర్తి, వ్యాసుడూ, హనుమంతుడు, విభీషణుడు, కృపాచార్యుడు, పరుశురాముడు.. వీరు ఏడుగురు చిరంజీవులు. హనుమంతుడు భవిష్య బ్రహ్మ, బలి చక్రవర్తి భవిష్య ఇంద్రుడు. నిత్యం వీరిని స్మరించడం వల్ల ఆనందంగా వందేళ్ళు జీవిస్తారు.