Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అమావాస్య దాటిన తొలి మంగళవారం ఇలా చేస్తే?

Advertiesment
అమావాస్య దాటిన తొలి మంగళవారం ఇలా చేస్తే?
, మంగళవారం, 29 జనవరి 2019 (12:48 IST)
అమావాస్య దాటిన తొలి మంగళవారం రోజు ఇంట్లో ఈ పూజ చేస్తే.. అప్పుల బాధలు తొలగిపోతాయి అంటున్నారు.. ఆధ్యాత్మిక పండితులు. ఇంటిల్లపాదిని అమావాస్య దాటిన తొలి మంగళవారం పూట శుభ్రం చేసుకుని.. పూజగదిని పూజకు సిద్ధం చేసుకోవాలి.


అలాగే ఇష్టదైవం ఫోటోను లేదా.. హనుమంతుడి ఫోటో ముందు పీటను వుంచి దానిపై ఒకటిన్నర మీటరు ఎర్రటి వస్త్రాన్ని పరచాలి. ఆ వస్త్రంపై ఐదు గోమతి చక్రాలను వుంచాలి. ఐదు దేశవాళీ గులాబీ పువ్వులను వుంచి.. మెరూన్ రంగు కుంకుమను ఒక స్పూన్ చేర్చాలి. 
 
అందులోనే చిన్నపాటి ఎర్రచందనం ముక్కను వుంచి.. పూజించాలి. అగరవత్తులతో పూజించాలి. తర్వాత కర్పూరంతో దీపారాధన చేయాలి. నైవేద్యంగా బెల్లం ముక్క, పంచదార లేదంటే.. ఖర్జూర పండ్లను.. సౌలభ్యానికి అనువుగా సమర్పించి దాన్ని ప్రసాదంగా స్వీకరించవచ్చు. ఇలా దీపారాధన పూర్తయ్యాక.. ఎర్రటి వస్త్రాన్ని మూటగట్టి.. కళ్లకు అద్దుకుని.. ధనస్థానం వద్ద వుంచాలి. 
 
నెల తర్వాత అలాగే అమావాస్య దాటిన మొదటి మంగళవారం కొత్త ఎరుపు వస్త్రంతో ఐదు గోమతి చక్రాలు, ఎరుపు చందనం ముక్క, గులాబీ పువ్వులు, కుంకుమ వుంచి పూజ చేసి.. ధనస్థానంలో వుంచాలి. పాత ఎరుపు వస్త్రంలో వున్న సామగ్రిని ప్రవహించే స్వచ్ఛమైన నీటిలో వదిలేయాలి. మురికిగా వున్న నీటిలో ఈ ఎరుపు రంగు వస్త్రాన్ని పారేయడం చేయకూడదు. 
 
స్వచ్ఛమైన ప్రవహించే నదిలో దీన్ని వేయడం ద్వారా త్వరితగతిన అప్పులు తీరిపోతాయి. ఇలా అప్పులు తీరే వరకు చేస్తూ వుంటే.. ఎక్కువ వారాల కంటే ముందుగానే ధన ఆదాయం వుంటుంది. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవడం గమనిస్తారని ఆధ్యాత్మిక పండితులు సూచిస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

29-01-2019 మంగళవారం దినఫలాలు : రుణ విముక్తులు... బ్రోకర్లకు శ్రమాధిక్యత...