Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మాంగల్య దోషాలుంటే.. రక్తదానం చేయాలి.. ఆర్థిక ఇబ్బందులు..?

bride
, సోమవారం, 14 ఆగస్టు 2023 (16:26 IST)
మాంగల్య దోషాలుంటే దంపతుల మధ్య కలహాలు ఏర్పడుతాయి. వ్యక్తిగత జీవితంలో ఇబ్బందులు, కెరీర్ పరంగా తంటాలు ఏర్పడుతాయి. అంతేగాకుండా ఇతరత్రా ఈతిబాధలు ఖాయం. ముఖ్యంగా ఆర్థిక సమస్యలు కూడా వుంటాయి. ఆవేశం, కోపం వుంటుంది. 
 
అలసట, సోమరితనం.. డబ్బు సంపాదనపై దృష్టి మళ్లకపోవడం జరుగుతుంది. ఆస్తినష్టం, శత్రు బాధలు, మానసిక ఇబ్బందులు ఏర్పడుతాయని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. 
 
ఇలాంటి ఇబ్బందులు కనుక మీరు ఎదుర్కొంటుంటే.. లేకుంటే జాతకంలో మాంగల్య దోషమున్నట్లు జ్యోతిష్య నిపుణులు చెప్తే.. భయపడనక్కర్లేదు. సింపుల్‌గా ఈ పరిహారాలకు చేస్తే చాలు. మాంగల్య దోషం వున్నవారు.. నారాయణ స్వామిని కొలవడం మరిచిపోకూడదు. 
 
రావి, మర్రి చెట్టు ప్రదక్షణలు చేయడం మంచిది. అంతేగాకుండా హనుమంతుడి పూజతో మాంగళ్య దోషాలను దూరం చేసుకోవచ్చు. మంగళవారాల్లో హనుమంతుడిని పూజించడం ద్వారా, హనుమాన్ చాలీసాను రోజూ పఠించడం ద్వారా మాంగల్య దోషం తొలగిపోతుంది. 
 
సింధూరాన్ని హనుమంతునికి సమర్పించడం సర్వశుభాలను ఇస్తుంది. మర్రిచెట్టుకు పూజ చేయడం నైవేద్యంగా పాలు, స్వీట్లు సమర్పించడం చేయొచ్చు. అలాగే పక్షులకు ఆహారంగా తృణధాన్యాలను పెట్టవచ్చు. ముఖ్యంగా మాంగళ్య దోషం వున్నవారు రక్తదానం చేయడం మంచిది. 
 
మంగళవారాల్లో ఉపవాసం వుండి.. దాల్ వంటకాలను మాత్రమే తీసుకోవాలి. ఇంకా పవిత్ర, శక్తివంతమైన గాయత్రీ మాత మంత్రాన్ని 108సార్లు పఠించాలి. 
 
అంతేగాకుండా "ఓం శ్రీం హనుమతే నమః" మంత్రాన్ని 108 సార్లు పఠించడం ద్వారా మాంగల్య దోషం తొలగిపోతుంది. ఇలా చేస్తే ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

దైవ పూజకు పుష్పాలు అవసరమా?