Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

09-06-2019 నుంచి 15-06-2019 వరకు మీ వార రాశిఫలాలు

Advertiesment
09-06-2019 నుంచి 15-06-2019 వరకు మీ వార రాశిఫలాలు
, శనివారం, 8 జూన్ 2019 (17:31 IST)
మేషం : అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం.
సంతానం విషయంలో శుభపరిణామాలు ఉంటాయి. కొత్త విషయాలపై దృష్టిసారిస్తారు. వ్యవహారాలతో తీరిక ఉండదు. ఆలోచనల్లో మార్పు వస్తుంది. ఊహించిన ఖర్చులే ఉంటాయి. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. మీ శ్రీమతి ఆరోగ్యం కుదుటపడుతుంది. పనులు మందకొడిగా సాగుతాయి. బుధవారం సందేశాల ప్రకటనల పట్ల అప్రమత్తంగా ఉండాలి. బ్యాంకు వివరాలు వెల్లడించవద్దు. వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఆశ్చర్యకరమైన సంఘటనలు ఎదురవుతాయి. అయినవారితో సంప్రదింపులు జరుపుతారు. మీ ప్రతిపాదనలకు ఆమోదం లభిస్తుంది. వ్యాపారాభివృద్ధికి పథకాలు అమలు చేస్తారు. చిరు వ్యాపారులకు పురోభివృద్ధి. ఉద్యోగస్తులకు పనిభారం, విశ్రాంతి లోపం. విందులు, వినోదాల్లో పాల్గొంటారు. ఉపాధి పథకాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. 
 
వృషభం :  కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2 పాదాలు. 
ఖర్చులు అంచనాలు మించుతాయి. అవసరాలకు ధనం సర్దుబాటు అవుతుంది. దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారమవుతాయి. మానసికంగా కుదుటపడతారు. గృహం ప్రశాంతగా ఉంటుంది. ఆత్మీయులను కలుసుకుంటారు. ఒక ఆహ్వానం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఆరోగ్యం కుదుటపడుతుంది. సంతానం చదువులపై దృష్టిపెడతారు. గురు, శుక్ర వారాల్లో పనులు ఒక పట్టాన పూర్తికావు. మీపై శకునాల ప్రభావం అధికం. కొన్ని విషయాలు పట్టించుకోవద్దు. ఆభరణాలు, పత్రాలు జాగ్రత్త. వ్యవహార ఒప్పందాల్లో మెలకువ వహించండి. బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి. ఉద్యోగస్తులకు ఏకాగ్రత ప్రధానం. వృత్తుల వారికి సదావకాశాలు లభిస్తాయి. వ్యాపారాల్లో స్వల్ప చికాకులు మినహా ఇబ్బందులుండవు. హోల్‌సేల్ వ్యాపారులకు పురోభివృద్ధి. బెట్టింగ్‌ల వల్ల ఇబ్బందులు తప్పవు. 
 
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ధ్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు. 
వ్యవహారానుకూలత అంతంత మాత్రమే. పట్టుదలతో యత్నాలు సాగించండి. సహాయం, సలహాలు ఆశించవవద్దు. మీ కృషి త్వరలో ఫలిస్తుంది. ఆదాయ వ్యాయాలకు ఏమాత్రం పొంతనవుండదు. శని, ఆదివారాల్లో ఊహించని ఖర్చులు ఆందోళన కలిగిస్తాయి. చెల్లింపులు వాయిదా వేసుకుంటారు. పరిచయం లేని వారితో జాగ్రత్త. ఆత్మీయుల కలయిక ఉపశమనం కలిగిస్తుంది. స్థిరాస్తి విక్రయంలో పునరాలోచన అవసరం. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. సంతానం విజయం ఉత్సాహాన్నిస్తుంది. అవగాహన లేని విషయాల్లో జోక్యం తగదు. పరిచయాలు, వ్యాపకాలు బలపడతాయి. గృహమార్పు కలిసివస్తుంది. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. అధికారులకు శ్రమాధిక్యత, విశ్రాంతి లోపం. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. వాహనం ఇతరులకివ్వొద్దు. 
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష. 
అనుకూల పరిస్థితులున్నాయి. కార్యసాధనలో సఫలీకృతులవుతారు. పరిచయాలు, బంధుత్వాలు బలపడతాయి. కొంతమొత్తం ధనం అందుతుంది. ఖర్చులు విపరీతం. పెట్టుబడులపై దృష్టిపెడతారు. అనుభవజ్ఞుల సలహా పాటించండి. దంపతులకు కొత్త ఆలోచనలు వస్తాయి. మీ ప్రమేయంతో శుభకార్యం నిశ్చయమవుతుంది. పనులు మొండిగా పూర్తి చేస్తారు. సోమ, మంగళవారాల్లో బంధువుల ఆకస్మిక రాక ఇబ్బంది కలిగిస్తుంది. స్వల్ప అస్వస్థతకు గురవుతారు. విశ్రాంతి అవసరం. సంతానం ఉన్నత చదువులను వారి ఇష్టానికే వదిలివేయండి. వ్యాపారాభివృద్ధికి మరింత శ్రమించాలి. మీ ప్రణాళికలు మున్ముందు సత్ఫలితాలిస్తాయి. ప్రస్తుత వ్యాపారాలే శ్రేయస్కరం. నిరుద్యోగులకు ఉపాధి శిక్షణ లభిస్తుంది. స్టాక్ మార్కెట్ రంగాల వారికి ఆశాజనకం. షేర్ల కొనుగోళ్ళకు అనుకూలం. 
 
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం. 
గృహం ప్రశాంతంగా ఉంటుంది. కొత్త విషయాలు తెలుసుకుంటారు. ఆర్థికస్థితి ఆశాజనకం. పొదుపు పథకాలు లాభిస్తాయి. ఊహించని ఖర్చులే ఉంటాయి. సన్నిహితులకు సాయం అందిస్తారు. కొత్త పరిచయాలేర్పడతాయి. పనులు ముగింపు దశలో మందకొడిగా సాగుతాయి. బుధవారం కావలసిన వ్యక్తుల కలయిక వీలుపడదు. కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. నగదు, పత్రాలు జాగ్రత్త. ఇంటి విషయాలపై శ్రద్ధ అవసరం. ఏ విషయాన్ని తేలికగా తీసుకోవద్దు. నిరుద్యోగుల కృషి ఫలిస్తుంది. ఉపాధ్యాయులకు పదోన్నతి, స్థానచలనం. వ్యాపారాలు ఊపందుకుంటాయి. భాగస్వామిక చర్చలు ఫలిస్తాయి. న్యాయ, సేవ సాంకేతిక రంగాల వారికి ఆదాయాభివృద్ధి. సంతానానికి విదేశీ విద్యావకాశం లభిస్తుంది.
 
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు. 
పరిచయాలు ఉన్నతికి తోడ్పతాయి. గృహం సందడిగా ఉంటుంది. వాగ్ధాటితో నెట్టుకొస్తారు. సమర్థతకు మంచి గుర్తింపు లభిస్తుంది. దుబారా ఖర్చులు విపరీతం. ప్రతి వ్యవహారం ధనంతో ముడిపడివుంటుంది. గత సంఘటనలు పునరావృతమవుతాయి. గురు, శుక్రవారాల్లో పనులు హడావుడిగా సాగుతాయి. ముఖ్యమైన పత్రాలు అందుకుంటారు. బాధ్యతలు అప్పగించవద్దు. ప్రియతముల ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. కుటుంబీకులతో సంప్రదింపులు జరుపుతారు. సంతానం విజయం ఉత్సాహాన్నిస్తుంది. వృత్తి ఉపాధి పథకాల్లో రాణిస్తారు. మార్కెట్ రంగాల వారికి ఆదాయాభివృద్ధి. వ్యాపారాలు ఊపందుకుంటాయి. హోల్‌సేల్ వ్యాపారస్తులకు పురోభివృద్ధి. అధికారులకు శ్రమాధిక్యత. విశ్రాంతిలోపం. బెట్టింగులు, పందాలు ఆందోళన కలిగిస్తాయి. వాహన చోదకులకు దూకుడు తగదు. 
 
తుల : చిత్త, 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు. 
ఇన్నాళ్లు పడిన కష్టానికి ప్రతిఫలం అందుతుంది. శుభవార్తలు వింటారు. ప్రణాళికలు రూపొందించుకుంటారు. బాధ్యతలు అధికమవుతాయి. ఖర్చులు అధికం. సంతృప్తికరం. శనివారం నాడు ఓర్పుతో శ్రమించినగాని పనులు పూర్తికావు. అనవసర విషయాలకు దూరంగా ఉండాలి. వాగ్వాదాలకు దిగవద్దు. మీ గౌరవానికి భంగం కలిగే సూచనలున్నయి. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఒక సమాచారం ఆసక్తి కలిగిస్తుంది. ఆత్మీయులను కలుసుకుంటారు. ఆరోగ్యం ట్ల అశ్రద్ధ తగదు. సంతానం విదేశీ చదువులపై దృష్టిపెడతారు. వ్యాపారాల్లో పురోభివృద్ధి. అనుభవం గడిస్తారు. పెట్టుబడులకు అనుకూలం. ఉపాధ్యాయులకు స్థానచలనం. కీలక సమావేశాలు, సన్మానాలు సంస్మరణ సభల్లో పాల్గొంటారు. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ట. 
ఆదాయానికి తగినట్టుగా ఖర్చులుంటాయి. పొదుపునకు అవకాశం లేదు. పరిచయస్తులు ధన సహాయం అర్థిస్తారు. పెద్దమొత్తం సాయం తగదు. మీ ఇష్టాయిష్టాలను సున్నితంగా వ్యక్తం చేయండి. పరిస్థితులు అనుకూలతలున్నాయి. ఆలోచనలు కార్యరూపంలో పెట్టండి. స్వయంకృషితో అనుకున్నది సాధిస్తారు. రావలసిన ధనం అందుతుంది. పనుల సానుకూలతకు ఓర్పు, కృషి ప్రధానం. ఆది, సోమవారాల్లో ప్రముఖుల సందర్శనం వీలుకాదు. ఒక సమాచారం తీవ్రంగా ఆలోచింపజేస్తుంది. నిర్మాణాలు, మరమ్మతులు వేగవంతమవుతాయి. సంతానం విజయం సంతోషపరుస్తుంది. వేడుకల్లో పాల్గొంటారు. ఉద్యోగస్తులకు ఏకాగ్రత, సమయపాలన ప్రధానం. వృత్తి ఉపాధి పథకాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. వ్యాపారాల్లో స్వల్ప చికాకులు మినహా ఇబ్బందులుండవు. ప్రయాణం విరమించుకుంటారు. 
 
ధనస్సు : మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాడ 1వ పాదం. 
శుభకార్యానికి యత్నాలు సాగిస్తారు. గృహంలో మార్పులు చేర్పులకు అనుకూలం. అయినవారితో విభేదాలు తలెత్తుతాయి. మీ మాటతీరు అదుపులో ఉంచుకోండి. ఆధిపత్యం ప్రదర్శించవద్దు. లౌక్యంగా పనులు చక్కబెట్టుకోండి. మీ శ్రీమతి సలహా పాటించండి. మంగళ, బుధవారాల్లో ఊహించని ఖర్చులుంటాయి. ధనంమితంగా వ్యయం చేయండి. సన్నిహితులతో సంప్రదింపులు జరుపుతారు. కావలసిన పత్రాలు అందుతాయి. సంతానం భవిష్యత్తుపై మరింత శ్రద్ధ అవసరం. ఆధ్యాత్మిక, సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ప్రస్తుత వ్యాపారాలే శ్రేయస్కరం. న్యాయ, వైద్య మెకానికల్ రంగాల వారికి ఆదాయాభివృద్ధి.. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి. చిన్ననాటి పరిచయస్తులను కలుసుకుంటారు. బెట్టింగులు ఆందోళన కలిగిస్తాయి. 
 
మకరం : ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవరణం, ధనిష్ట 1, 2 పాదాలు. 
వ్యవహారాలను సమర్థంగా నిర్వహిస్తారు. ధనలాభం. వాహనయోగం ఉన్నాయి. ఆర్థికస్థితి సంతృప్తికరం. నిర్దిష్ట ప్రణాళికలు రూపొందించుకుంటారు. పరిస్థితులు అనుకూలిస్తాయి. పనుల ప్రారంభంలో ఆటంకాలెదుర్కొంటారు. గురువారం నాడు బంధువుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. ఇతరుల విషయాల్లో జోక్యం తగదు. దంపతులకు కొత్త ఆలోచనలు వస్తాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. సంతానం భవిష్యత్తుపై దృష్టిపెడతారు. ప్రకటనలు, దళారులను విశ్వసించవద్దు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. పోగొట్టుకునవి సంపాదిస్తారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఆలయాలు, సేవా సంస్థలకు సాయం అందజేస్తారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. షేర్ల క్రయ, విక్రయాలకు అనుకూలం. ఉద్యోగస్తులకు ఒత్తిడి, పనిభారం. వివాదాలు సద్దుమణిగిపోతాయి. 
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు. 
ఈ వారం ఖర్చులు అధికం. ఒక అవసరానికి ఉంచిన ధనం మరోదానికి వ్యయం చేస్తారు. పనులు హడావుడిగా సాగుతాయి. ఇంటి విషయాల పట్ల శ్రద్ధ అవసరం. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. గృహమార్పు నిదానంగా కలిసివస్తుంది. వ్యవహారానుకూలత అంతంత మాత్రమే. ఓర్పుతో యత్నాలు సాగించండి. ఊహించని సంఘటనలు ఎదురవుతాయి. సన్నిహితులతో సంప్రదింపులు జరుపుతారు. మీ ఆలోచనల్లో మార్పు వస్తుంది. సంతానం విదేశీ చదువులపై దృష్టిపెడతారు. దంపతుల మధ్య అమరికలు మంచి ఫలితాలిస్తాయి. ఉద్యోగస్తులు సమర్థత అధికారులకే లాభిస్తుంది. వేడుకల్లో పాల్గొంటారు. వాహన చోదకులకు ఏకాగ్రత ప్రధానం. 
 
మీనం : పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి. 
వ్యాపకాలు సృష్టించుకుంటారు. పనులు సకాలంలో పూర్తిచేస్తారు. మీ జోక్యం అనివార్యం. సన్నిహితులకు చక్కని సలహాలిస్తారు. అవకాశాలు కలిసివస్తాయి. గృహం సందడిగా ఉంటుంది. ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులు ఉంటాయి. వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు. సంతానం అత్యుత్సాహం ఇబ్బంది కలిగిస్తుంది. ఫోన్ సందేశాల పట్ల అప్రమత్తంగా ఉండాలి. బ్యాంకు వివరాలు వెల్లడించవద్దు. పరిచయం లేనివారితో జాగ్రత్త. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది ముఖ్యమైన పత్రాలు అందుకుంటారు. ఉపాధ్యాయులకు కొత్త సమస్యలెదురవుతాయి. వ్యాపారాభివృద్ధికి మరింత శ్రమించాలి. సరకు నిల్వలో జాగ్రత్త. వృత్తుల వారికి ఆదాయాభివృద్ధి. ఓర్పుతో ఉద్యోగయత్నం సాగించండి. అధికారులకు ధనప్రలోభం తగదు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

08-06-2019 మీ రాశిఫలాలు : విదేశాల్లోని ఆత్మీయులు...