పెళ్లి జరుగుతుంటే సాధారణంగా వర్షం పడకుండా ఉండాలనుకుంటారు. అయితే పెళ్లి రోజున వర్షం పడటం మంచిదా? కాదా? అనేది తెలుసుకుందాం.. సాధారణంగా వర్షం పడితే వాతావరణం ఆహ్లాదకరంగా వుంటుంది. అందుకే వర్షం పడితే వధూవరులకు అదృష్టమని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు.
వధూవరులకు వరుణుని ఆశీర్వాదం లభించినట్లు చెప్తారు. ఇది శుభసూచకంగా పరిగణింపబడుతుంది. వివాహం జరుగుతుండగా వర్షం వస్తే దంపతులు సఖ్యతగా వుంటారు. వారిలో ఐక్యత పెరుగుతుంది.
సంతోషమయ జీవితం చేకూరుతుంది. అదృష్టానికి లోటుండదు. సిరిసంపదలు వెల్లివిరుస్తాయి. వివాహం సమయంలో వర్షం పడితే ఆపై శుభకార్యాలకు ఎలాంటి లోటుండదు. అందుకే వివాహం జరుగుతున్నప్పుడు వర్షం పడటాన్ని శుభ సూచకంగా భావించాలని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు.
వర్షం పడుతుందని వాతావరణ సూచన ఉంటే, సిద్ధంగా ఉండటం మంచిది. పెళ్లి బృందం కోసం మరియు మీ అతిథుల కోసం గొడుగులు చేతిలో ఉంచుకోండి. తేలికపాటి పొగమంచు వర్షం కురిస్తే.. ఆల్బం కోసం వర్షంలో కొన్ని ఫోటోలను తీయడానికి సిద్ధంగా వుండండి. ఇవి మధుర జ్ఞాపకాలుగా మిగిలిపోతాయి.