Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Wednesday, 9 April 2025
webdunia

ముక్కోటి ఏకాదశి: ద్వాదశి పారణ ఎలా చేయాలంటే..?

Advertiesment
Mokshada Ekadashi
, శనివారం, 26 డిశెంబరు 2020 (05:00 IST)
ముక్కోటి ఏకాదశి రోజున గీతా జయంతిని కూడా జరుపుకుంటారు. మోక్షాద ఏకాదశి అని పిలువబడే ముక్కోటి ఏకాదశి ఉపవాసాలను నిజమైన మనస్సుతో, భక్తితో మోక్షానికి దారితీస్తుందని నమ్ముతారు. అందుకే ఈ ఏకాదశి పేరును మోక్షం అని పిలుస్తారు. వైష్ణవులు ఏకాదశి ఉపవాసాన్ని చాలా ప్రత్యేకంగా భావిస్తారు. 
 
ఏకాదశినాడు పూర్తిగా ఉపవాసం ఉండలేని వాళ్ళు పండ్లు, సగ్గుబియ్యం, పాలు, పెరుగు, మజ్జిగ తీసుకోవచ్చు. ధాన్యాలు కాని, పప్పుదినుసులు కానీ స్వీకరించరాదని పురాణాలు చెప్తున్నాయి.
 
ఏకాదశి వ్రతం ఆచరించి అంటే ఉపవాసం ఉన్నవారు తర్వాతి రోజు అంటే ద్వాదశి తిథినాడు భోజనం చేసే విధానాన్ని పారణం అంటారు.  ద్వాదశినాడు ద్వాదశి ఘడియలు వెళ్ళకముందే పారణం (భోజనం) చేయాలి. దేవతలకు ఆరునెలలు పగలు, ఆరునెలలు రాత్రి. దక్షిణాయానం రాత్రికాలం. ఈ చీకటి తొలగి దేవతలు వెలుగులోకి వస్తారు. అంటే వారికి పగలు ప్రారంభమైనట్టు. అందుకే ఆ రోజు ఉపవాసం పుణ్యప్రదం.
 
బ్రహ్మ స్వేదబిందువు నుండి రాక్షసుడు జన్మించాడని, బ్రహ్మ ఆజ్ఞతో ముక్కోటి ఏకాదశి నుండి అన్నంలో నివసిస్తాడని పురాణ కథనం. అందుకే ప్రతి ఏకాదశినాడు భోజనం మాని ఉపవాసం ఉండాలంటారు…ఏడాదిలో 24 ఏకాదశుల్లో ఉపవాసం ఉంటే వచ్చే మొత్తం ఫలితం ముక్కోటి ఏకాదశిరోజు ఉంటే వస్తుంది. ఆ రోజూ అవకాశం లేనివారు తొలి ఏకాదశినాడు ఉంటే లభిస్తుంది.
 
ఏకాదశి తిథి 24వ తేదీ గురువారం డిసెంబర్ అర్థరాత్రి 11.17 నిమిషాలకు ప్రారంభమై.. 25వ తేదీ శుక్రవారం అర్థరాత్రి దాటిన తర్వాత 01.54 గంటలకు ముగుస్తుంది. ద్వాదశి పారణ సమయం 26వ తేదీ శనివారం ఉదయం 08.30 గంటల నుంచి 09.16 గంటల్లోపు ముగుస్తుంది. ఈ పారణ సమయం మధ్యస్థ ఫలితాలను ఇస్తుంది. అయితే ప్రాతః కాల పూజతో పారణ ముగిస్తే విశేష ఫలితాలు లభిస్తాయి. అందుచేత శనివారం తెల్లవారు జాము 3 గంటల నుంచి 4.30 గంటల్లోపూ పారణను ముగించడం ఉత్తమ ఫలితాలను ఇస్తుందని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు.  

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వైకుంఠ ఏకాదశి వ్రతం.. అవిసె ఆకులు.. ఉసిరికాయ తప్పకుండా వుండాలట..!