Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

సంక్రాంతికి జ్యోతిష్యానికి సంబంధం ఉందా? పగటి పూటే యజ్ఞాలు ఎందుకు చేస్తారో తెలుసా?

సంక్రాంతికి జ్యోతిష్యానికి సంబంధం ఉందా? సంక్రాంతికి శాస్త్రానికి లింకుందా? అనేది తెలియాలంటే.. ఈ స్టోరీ చదవాల్సిందే. నక్షత్రాలు 27. ఈ నక్షత్రాల్లో ఒక్కో నక్షత్రానికి నాలుగు పాదాలుంటాయి. ఇవి మొత్తం 108

సంక్రాంతికి జ్యోతిష్యానికి సంబంధం ఉందా? పగటి పూటే యజ్ఞాలు ఎందుకు చేస్తారో తెలుసా?
, శుక్రవారం, 13 జనవరి 2017 (13:42 IST)
సంక్రాంతికి జ్యోతిష్యానికి సంబంధం ఉందా? సంక్రాంతికి శాస్త్రానికి లింకుందా? అనేది తెలియాలంటే.. ఈ స్టోరీ చదవాల్సిందే. నక్షత్రాలు 27. ఈ నక్షత్రాల్లో ఒక్కో నక్షత్రానికి నాలుగు పాదాలుంటాయి. ఇవి మొత్తం 108 పాదాలుగా విభజింపబడినాయి. తిరిగి 108 పాదాల్ని 12 రాశులుగా విభాగించారు. సూర్యుడు నెలకు ఒక రాశిలో ప్రవేశిస్తాడు. అలా సూర్యుడు ఏ రాశిలో ప్రవేశిస్తే.. ఆ రాశి సంక్రాంతిగా వ్యవహరించబడుతోంది. ఇలా సూర్యుడు మకర రాశిలో ప్రవేశించినప్పుడు ఈ రాశిని మకర సంక్రాంతి అంటారు. 
 
సూర్యుడు ప్రాణాధారం. సూర్యకాంతితోనే చంద్రుడు ప్రకాశిస్తాడు. మనస్సు కారకుడు చంద్రుడు. చంద్రుడు కర్కాటక రాశ్యాధిపతి. సూర్యుడు మిథునరాశి నుంచి కర్కాటక రాశిలో కర్కాట సంక్రమణంలో ప్రవేశిస్తాడు. అదే దక్షిణాయనం. ఇంద్రుడు తూర్పు దిక్కునకు అధిపతి. వరుణుడు పడమరకు అధిపతి. వీరిద్దరి వాహనాలు ఐరావతమ, మకరము. సూర్యుడు ధనుర్రాశి నుంచి మకరరాశిలోకి ప్రవేశించినప్పటి నుంచి కర్కాటక రాశిలో ప్రవేశించేంత వరకు దేవతలకు పగలుగా ఉంటుంది. 
 
అలాగే సూర్యుడు కర్కాటక రాశిలో ప్రవేశించింది మొదలు ధనురాశిలో ప్రవేశించేంత వరకు దేవతలకు రాత్రి. ఉత్తరాయణం దేవతలకు పగలుగా ఉంటుంది. అందుకే సంక్రాంతి రోజున ఆవునెయ్యితో శివుడికి అభిషేకం చేయించడం శ్రేయస్కరం. దేవతలకు పగటి కాలంలో యజ్ఞయాగాదులు చేసి వారి అనుగ్రహాన్ని పొందమని మకర సంక్రాంతిని సూచిస్తుంది. 
 
ఈ రోజు పితృదేవతలకు తర్పణం విడుస్తారు. ఈ రోజు దానం చేయడం ద్వారా పుణ్యంగా భావిస్తారు. అందుకే సంక్రాంతి రోజున ఏ దానమైనా మహా పుణ్యమే. అలాగే సంక్రాంతి రోజున కొత్త బియ్యంతో పొంగలి చేసి, సంక్రాంతి లక్ష్మీదేవికి నైవేద్యం పెడతారు. అందుకే  దేవతలకు పగటి కాలంలో యజ్ఞయాగాదులు చేసి దేవతల అనుగ్రహాన్ని పొందమంటారు. మకర సంక్రాంతి పవిత్రమైన ఉత్తరాయణ పుణ్యకాలం ఉత్తమ లోకప్రాప్తిని కలిగిస్తుంది. ఈ రోజున స్వర్గంలో వాకిళ్లు తెరుస్తారని, ఈ రోజున మరణించిన వారు నేరుగా స్వర్గానికి వెళ్తారని శాస్త్రాలు చెప్తున్నాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సంక్రాంతి పండుగ రోజున ఆవునేతితో.. శివునికి అభిషేకం చేయిస్తే?