Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

గురు గోచారం.. చతుర్‌గ్రాహి యోగం.. ఈ రాశులకు యోగం..

Advertiesment
Astrology

సెల్వి

, శుక్రవారం, 3 మే 2024 (20:40 IST)
గురు పరవర్తనం.. మే 1వ తేదీన జరిగింది. ఈ గురు పరివర్తనం కారణంగా చతుర్‌గ్రాహి యోగం ఏర్పడింది. గురుభగవానుడు వృషభరాశిలో సంచారించడం ద్వారా వృషభరాశిలో నాలుగు గ్రహాలు కలయిక ద్వారా చతుర్‌గ్రాహి యోగం ఏర్పడింది. 
 
2024 మే నెలలో, గురు భగవానుడు 12 సంవత్సరాల తర్వాత వృషభంలో పరివర్తనం చెందారు. ఇంకా 12 సంవత్సరాల తర్వాత, వృషభంలో 4 గ్రహాల కలయిక ఏర్పడుతుంది. ఇందులో గురు భగవానుడు బుధుడు, శుక్రుడు, సూర్యుడు కలిసి ఉన్నారు. 
 
మే 10వ తేదీకి తర్వాత బుధ గ్రహం వృషభంలోకి మార్పు చెందుతాడు. ఆపై సూర్యుడు మే 14 తేదీ వృషభ రాశికి మార్పు చెందుతాడు. ఆపై మే 19వ తేదీ శుక్రుడు కూడా వృషభ రాశికి మారుతాడు. చతుర్‌గ్రాహి యోగంతో పాటు గురువుతో శుక్రుడు చేరడంతో గజలక్ష్మీ రాజయోగం ఏర్పడుతోంది. దీంతో ఐదు రాశులకు సంపదలను ఇస్తాయి. తద్వారా ఆ ఐదు రాశుల వారికి సకలసంపదలు, అష్టైశ్వర్యాలు చేకూరుతాయి.  
 
వృషభ రాశిలో గురు, శుక్రుడు, బుధుడు, సూర్యుడు చేకూరుతుంది. చతుర్‌గ్రాహి యోగంతో ధనాభివృద్ధి, వ్యాపారంలో వృద్ధి చేకూరుతుంది.
 
కన్యారాశిలో గురు పరివర్తనం కారణంగా చతుర్‌గ్రాహి యోగం కారణంగా ఉద్యోగ అవకాశం చేకూరుతుంది. కెరీర్ పరంగా మంచి అవకాశాలు వస్తాయి. వృత్తి పరంగా గురు పరివర్తనం సానుకూల ఫలితాలను ఇస్తుంది. పోటీ పరీక్షల్లో రాణిస్తారు. అలాగే విదేశాలకు వెళ్లాలనుకునే వారి కలలు సాకారం అవుతాయి. సంతాన ప్రాప్తి కలుగుతుంది.  
 
వృశ్చికరాశి జాతకులకు ఈ యోగం ద్వారా శుభ ఫలితాలు వుంటాయి. కుటుంబ సభ్యుల మద్దతు లభిస్తుంది. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. ఆధ్యాత్మిక ప్రయాణం చేకూరుతుంది. 
 
మకరరాశి జాతకులకు చతుర్‌గ్రాహి యోగం మంగళకారకుడు. రాశి అధిపతి శని కారణంగా ధనాదాయం చేకూరుతుంది. తద్వారా శుభ ఫలితాలు చేకూరుతాయి. పదోన్నతి చేకూరుతుంది. కొత్త ఉద్యోగ అవకాశాలు చేకూరుతాయి. 
 
మీనరాశి జాతకులకు ఈ యోగం ద్వారా శుభ ఫలితాలు చేకూరుతాయి. పనిచేసే చోట తోటి ఉద్యోగుల సహకారం లభిస్తుంది. ఆదాయం చేకూరుతుంది. ఆర్థిక ఇబ్బందులు  తొలగిపోతాయి. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

03-05-2024 శుక్రవారం దినఫలాలు - రావలసిన ధనం చేతికందుతుంది...