Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఇందువల్లనే తొమ్మిది లక్కీ నెంబర్... అందుకే ఆ నెంబర్ కోసం...

Advertiesment
lucky number 9
, శనివారం, 2 మే 2015 (17:43 IST)
తొమ్మిదిలో ఏముంది... తొమ్మిదిని అదృష్ట సంఖ్యగా చాలామంది భావిస్తారు ఎందుకు..? వాహనాలు, ఇంటి నెంబర్లు, శుభ సమయాల్లో చేయాల్సిన పనులకు 9తో కలిసొచ్చే తేదీలు ఎందుకు...? అంటే దాని వెనుక చాలా కారణాలున్నాయి. అవేంటో ఒక్కసారి చూద్దాం. మనకున్న గ్రహాలు 9. శక్తి పీఠాలు 18.. వాటిని కలిపితే 9. శబరిమల అయ్యప్పస్వామి మెట్లు 18. సృష్టికి మూలమైన అమ్మవారి రూపాలను నవదుర్గలుగా కొలుస్తారు. మహాభారతంలో పర్వాలు 18. మహాభారతం యుద్ధం జరిగింది 18 రోజులు. 

 
భగవద్గీత అధ్యాయాలు 9. వ్యాసమహర్షి పురాణాలు 18. కృత, త్రేతా, ద్వాపర, కలి యుగాల అక్షరాలు 9. అష్టోత్తర పూజలలో ఉండే మంత్రాలు 108. ఏ జీవరాశి జన్మించినా 27 నక్షత్రాలలోని నాలుగు పాదాల్లోనే జన్మించాలి. ఆ 27ని 4తో గణిస్తే వచ్చే 108. మాతృమూర్తి గర్భంలో శిశువు నవమాసాలు మోస్తుంది. మనిషి శరీరంలో ఉన్న రంధ్రాలు కూడా 9. చివరకు సెల్ ఫోన్ కీ ప్యాడ్, కంప్యూటర్ పై ఉండే కీబోర్డు ఉండే అంకెలు కూడా 9. అంకెల్లో పెద్దది కూడా తొమ్మిదే. అందుకే 9ని అందరూ లక్కీ నెంబరు అంటారు.

Share this Story:

Follow Webdunia telugu