ప్రతి శనివారం హనుమాన్ దేవాలయానికి వెళ్లి హనుమంతునికి సింధూరం రాయడం ద్వారా అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి. హనుమంతుడి మెడలో మందార లేదా తమలపాకుల మాల వేయడం ద్వారా ఈతిబాధలు తొలగిపోతాయి. ఆంజనేయునికి 11 ప్రదక్షణలు, 11 తమలపాకుల మాల సమర్పించటంతో కోరిన కోరికలు నెరవేరుతాయి.
అహిరవన్ మహిరవన్ అనే ఇద్దరు రాక్షసులు మోసపూరితంగా రామలక్ష్మణులను పాతాళానికి తీసుకెళ్లారు. ఆ రాక్షసులు వారిద్దరినీ తన దేవతకు బలి ఇవ్వబోతున్న సమయంలో, హనుమంతుడు ఎర్ర దేవత రూపాన్ని తీసుకొని రామ లక్ష్మణులను విడుదల చేశాడు. ఈ ఘటన జ్ఞాపకార్థకంగా హనుమంతుడికి సింధూరం రాయడం ఆనవాయితీగా వస్తోంది.