Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

శ్రీమహాలక్ష్మీ దేవికి రుద్రాక్ష ఎలా లభించిందో తెలుసా? (video)

Advertiesment
శ్రీమహాలక్ష్మీ దేవికి రుద్రాక్ష ఎలా లభించిందో తెలుసా? (video)
, శుక్రవారం, 28 ఫిబ్రవరి 2020 (16:28 IST)
rudraksha
శ్రీ మహావిష్ణువు కృష్ణావతారం, రామావతారంతో పాటు దశావతారాలతో ఈ జగత్తును ఉద్ధరించిన సంగతి తెలిసిందే. సర్వేజన సుఖినోభవంతు.. అన్నట్లు ప్రజలను ఇక్కట్ల నుంచి కాపాడేందుకు భగవంతుడు దశావతారాలెత్తారు. ఇందుకు కృతజ్ఞతలు తెలిపే విధంగా ముక్కోటి దేవతలు ఇంద్రునితో పాటు విష్ణువు పలు విలువైన నవరత్నాలను, ఆభరణాలను కానుకగా సమర్పించుకున్నారు. 
 
అయితే పరమేశ్వరుడు మాత్రం ఒకే ఒక రుద్రాక్షను శ్రీ మహావిష్ణువుకు కానుకగా ఇచ్చారు. పరమేశ్వరుడు ఇచ్చిన ఆ రుద్రాక్షను శ్రీపతి కూడా వినయంగా స్వీకరించి.. కంటికి అద్దుకున్నారు. దీన్ని చూసిన దేవతలంతా.. బంగారు, నవరత్నాలు కానుకలిచ్చిన తమను అవమానపరిచినట్లు భావించారు. ఇంకా నల్లటి బొగ్గులా కనిపించే రుద్రాక్షను శ్రీమహావిష్ణువు స్వీకరించడం ఏమిటని దాన్ని పారేయమని నిర్లక్ష్యంగా మాట్లాడారు. 
 
దీన్ని విన్న విష్ణువు తులాభారం వేశారు. ఒక తట్టలో దేవతలు తెచ్చిన బంగారం, నవరత్నాలను వుంచమన్నారు. ఒకవైపు రుద్రాక్షను వుంచమన్నారు. కానీ బంగారు నగలన్నీ రుద్రాక్షకు సరిసమానంగా తూగలేకపోయాయి. దీన్ని గమనించిన శ్రీ మహాలక్ష్మి పరమేశ్వరుని వద్ద క్షమాపణలు కోరి ఆ రుద్రాక్షను భద్రంగా తన వద్దే వుంచుకుంది. 
 
ఇదంతా చూసిన కుబేరుడు.. ఎప్పుడెప్పుడు పరమేశ్వరుడి రుద్రాక్షను దేవతలు పారేస్తారా..? దాన్ని తీసుకెళ్దామా అని వేచి చూశాడు. పరమేశ్వరుడు ఇచ్చిన రుద్రాక్షకు తన నవనిధులు సమం కావని కుబేరుడు అన్నాడు. అందుకే రుద్రాక్ష వున్న చోట కుబేరుడు, లక్ష్మీదేవి నివాసం వుంటుందని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. 
 
ఏ ఇంట ఈ రుద్రాక్షను పూజిస్తారో.. అక్కడ ఆర్థిక నష్టం వుండదు. ధనాదాయం వుంటుంది. లక్ష్మీకుబేరుని అనుగ్రహం లభిస్తుందని విశ్వాసం. అంతేగాకుండా రుద్రాక్ష మాలను ధరించే వారికి లక్ష్మీకుబేర అనుగ్రహం లభిస్తుందని పండితులు చెప్తున్నారు. రుద్రాక్షలో 18 రకాలైన శివమంత్రాలున్నాయి.

అందుకే రుద్రాక్ష వున్న ఇంట ఈతిబాధలుండవు. ఆర్థిక ఇబ్బందులు అస్సలు వుండవు. అలాగే ఏ ఇంట శ్రీ రుద్రం వినబడుతుందో.. ఆ ఇంటికి కుబేరుడు, శ్రీలక్ష్మి చేరుకుంటారని శివపురాణం చెప్తోంది.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

28-02-2020 శుక్రవారం మీ రాశి ఫలితాలు - గౌరీదేవిని ఆరాధించినట్లైతే..? (video)