Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కన్యారాశి జాతకులు మనీ రొటేషన్ చేయడంలో నేర్పరులు

Advertiesment
Virgo
, మంగళవారం, 7 ఫిబ్రవరి 2023 (16:49 IST)
కన్యారాశిలో జన్మించిన జాతకులు మేధావులతో, ఆధ్యాత్మిక గురువులతో సన్నిహిత సంబంధాలు లాభిస్తాయి. మనీ రొటేషన్ చేయడంలో మంచి నేర్పరితనం ఉంటుంది. త్వరితగతిన ఇతరులపై నమ్మకం ఏర్పరుచుకోరు. అయినా నమ్మి మోసపోతారు. 
 
మధ్యవర్తిత్వ సంతకాలు, ఇతరుల విషయంలో హామీ ఇవ్వడం కలిసిరావు. వీలునామాలు లిటిగేషన్ వ్యవహారాలు లాభిస్తాయి. మేధావులతో, ఆధ్యాత్మిక గురువులతో సన్నిహిత సంబంధాలు లాభిస్తాయి. అంతర్గత రాజకీయాలు ప్రతిచోటా ఇబ్బంది కలిగిస్తాయి. కొంత పురోగతి సాధించిన తర్వాత మిమ్మల్ని బైటకు పంపే ప్రయత్నాలు జరుగుతాయి. 
 
వివాహ జీవితంలో చెప్పుకోదగిన ఒడిదుడుకులు ఉండవు. స్వయంకృతాపరాధాలు వుంటాయి. శుక్ర దశయోగవంతం అయ్యింది. మధ్యస్త జీవితం నుంచి విలాసవంతమైన జీవితం గడుపుతారు. ఇబ్బందుల్లో వున్న స్త్రీలను ఆదుకుని కష్టాలు కొని తెచ్చుకుంటారు. 
 
సంతాన పురోగతి ప్రారంభంలో ఇబ్బందులకు గురి చేస్తుంది. బుధగ్రహం అనుకూలత వల్ల అధికార ప్రాప్తి, ప్రజల్లో మంచి ప్రఖ్యాతి లభిస్తుంది. కొద్దిపాటి నిర్లక్ష్యం కూడా పనికి రాదు. భూములు, పెద్దలిచ్చిన ఆస్తుల వంటివి అన్యాక్రాంతం అయ్యే అవకాశం వుంది. 
 
కొన్ని వివాదాలు స్థిరాస్తుల పరంగా తప్పకపోవచ్చు. ప్రైవేట్ వ్యక్తులు నడిపే చిట్ పంఢ్స్ వ్యవహారాల పట్ల జాగ్రత్త వహించాలి. విష్ణు సహస్రనామ పారాయణ, సుదర్శనకవచ పారాయణ వల్ల మేలు జరుగుతుంది. గణపతి దేవుని అర్చన విశేష ఫలితాలు లభిస్తాయి. ఉత్తర, దక్షిణ దిశలు లాభిస్తాయని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తేదీ 07-02-2023 మంగళవారం దినఫలాలు - కార్తీకేయుడిని పూజించినా మీ మనోసిద్ధి..