Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కాలసర్ప దోషాన్ని నివృత్తి చేసుకోవాలంటే.. భైరవుడిని పూజించాలి.. లేదా?

రాహు- కేతు గ్రహాల మధ్య ఇతర గ్రహాలు చిక్కుకుంటే.. అది కాలసర్ప దోషం కిందకు వస్తుంది. కాలసర్ప దోషం ఉన్నవారు.. భైరవుడిని స్తుతించాలి. వారానికి ఓ రోజు భైరవునికి పూజ చేయించాలి. ఇలా చేస్తే దోషాన్ని నివృత్తి

కాలసర్ప దోషాన్ని నివృత్తి చేసుకోవాలంటే.. భైరవుడిని పూజించాలి.. లేదా?
, మంగళవారం, 13 సెప్టెంబరు 2016 (18:39 IST)
జాతక చక్రంలో రాహు, కేతు గ్రహాల ఆధిపత్యం ఎక్కువగా ఉన్నట్లైతే.. జాతకంలో కాలసర్ప దోషం ఉందని అర్థం. జాతకంలో కాలసర్ప దోషం ఉందని జ్యోతిష్కులు చెబితే భయపడనక్కర్లేదు. ఇలా చేస్తే సరిపోతుంది. కాలసర్ప దోషంతో వివాహంలో అడ్డంకులు, వైవాహిక బంధంలో మనస్పర్ధలు ఏర్పడుతాయి. కాలసర్ప దోషం ఉన్న వారు 33 ఏళ్ల వరకు పలు సమస్యలను ఎదుర్కొంటారు.
 
అయితే 33 ఏళ్ల తర్వాత వారి జీవితం సుఖసంతోషాలతో వెల్లివిరుస్తుంది. దిగ్విజయాలు చేకూరుతాయని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. అందుచేత కాలసర్ప దోషం ఉందని జ్యోతిష్కులు చెప్పినా జడుసుకోవాల్సిన అవసరం లేదు. రాహు- కేతు గ్రహాల మధ్య ఇతర గ్రహాలు చిక్కుకుంటే.. అది కాలసర్ప దోషం కిందకు వస్తుంది. కాలసర్ప దోషం ఉన్నవారు.. భైరవుడిని స్తుతించాలి. వారానికి ఓ రోజు భైరవునికి పూజ చేయించాలి. ఇలా చేస్తే దోషాన్ని నివృత్తి చేసుకోవచ్చు. 
 
కాలసర్ప దోషంతో వివాహ అడ్డంకులే కాకుండా ఉపాధి అవకాశాలు లభించకపోవడం, దుష్టులతో సహవాసం వంటివి ఏర్పడతాయి. ఈ దోషాన్ని నివృతి చేసుకోవాలంటే..? తమిళనాడులోని కాంచీపురం కామాక్షి అమ్మవారి ఆలయానికి సమీపంలో కాళీయ నాగం లింగాన్ని ప్రతిష్టించి పూజించినట్లు చెప్తారు. అందుచేత ఈ ఆలయంలోని ఈశ్వరుడిని పూజించడం ద్వారా రాహు-కేతు దోషాలు తొలగిపోతాయి. ఇంకా ఆదిశేషుడు పూజించిన దివ్యస్థలం చెన్నైలోని తిరువొత్తియూర్. తిరువొత్తియూర్‌లో వెలసిన శ్రీ వడివుడైయమ్మన్ ఆలయంలోని పరమేశ్వరుడిని పూజిస్తే రాహు-కేతు దోషాలు తొలగిపోతాయని పండితులు చెప్తున్నారు.
 
* ఇంకా శివుడికి రుద్రాభిషేకం చేయించండి
* శివుడికి పాలు, రోజ్ వాటర్ వంటి వాటితోనూ అభిషేకం చేయిస్తే సత్ఫలితాలిస్తాయి. 
* పౌర్ణిమి, అమావాస్యల్లో శివుడికి పై అభిషేకాలు నిర్వహిస్తే కాలసర్ప దోషాలు నివృత్తి అవుతాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వామన జయంతి పూజా విశిష్టత.... వామనుని కథ