Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

గ్రహదోషాలను పోగొట్టే కాలభైరవుడు.. అష్టమి రోజున?

swarna Bhiravar

సెల్వి

, శనివారం, 2 మార్చి 2024 (22:12 IST)
భైరవమూర్తిని అష్టమి రోజున పూజించడం ద్వారా విశేష ఫలితాలను ప్రసాదిస్తాడు. భైరవుడిని కాలపురుషుడిగా పేర్కొంటారు. 12 రాశులు ఆయన రూపంలో భాగమైనాయి. భైరవుడు రాజుగానూ.. ఆయన ఆదేశించే కార్యాలను  నవగ్రహాలు ఆచరిస్తాయి. 
 
కాలభైరవుని ఆజ్ఞానుసారమే.. గ్రహాల సంచారం వుంటుంది. అందుకే కాలభైరవుడిని నిష్ఠతో ప్రార్థిస్తే అనుకున్న కోరికలు నెరవేరడమే కాకుండా గ్రహ దోషాలు తొలగిపోతాయి అంటున్నారు ఆధ్యాత్మిక పండితులు. 
 
ఈ రోజున దేవాలయాల్లో కాలభైరవునికి కర్పూర తైల చూర్ణముతో అభిషేకం చేయించాలి. గారెలతో మాల వేసి, కొబ్బరి, బెల్లం నైవేద్యంగా సమర్పిస్తే జాతకంలో వున్న సమస్త గ్రహ దోషాలు తొలగి.. ఈశ్వరుని అనుగ్రహం లభించి ఆయుష్షు పెరుగుతుంది. 
 
ఇంకా ఎనిమిది మిరియాలను ఓ తెలుపు కాటన్ గుడ్డలో కట్టి వత్తుల వలె చేసి.. భైరవుని తలచి రెండు దీపాలను నువ్వుల నూనెతో వెలిగిస్తే.. అష్టమ, అర్ధాష్టమ, ఏలినాటి శని దోషాలు తొలగిపోతాయి. శనిదోషాల నుంచి విముక్తి లభిస్తుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

03-03- 2024 నుంచి 09-03-2024 వరకు మీ వార రాశి ఫలితాలు