Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

08-06-2017 రాశి ఫలితాలు... అవకాశం చేజారినా మంచిదే...

మేషం : ఆదాయానికి తగినట్లుగానే ఖర్చులు ఉంటాయి. సంఘంలో మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. స్త్రీలకు విదేశీ వస్తువుల పట్ల ఆసక్తి పెరుగుతుంది. బ్యాంకు వ్యవహారాల్లో అపరిచిత వ్యక్తులతో మెళకువ అవసరం. ఊహించని ఖర్చులు, బంధువుల రాక వల్ల మానసికాందోళనలు వంటివి

Advertiesment
daily predictions
, బుధవారం, 7 జూన్ 2017 (21:57 IST)
మేషం :  ఆదాయానికి తగినట్లుగానే ఖర్చులు ఉంటాయి. సంఘంలో మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. స్త్రీలకు విదేశీ వస్తువుల పట్ల ఆసక్తి పెరుగుతుంది. బ్యాంకు వ్యవహారాల్లో అపరిచిత వ్యక్తులతో మెళకువ అవసరం. ఊహించని ఖర్చులు, బంధువుల రాక వల్ల మానసికాందోళనలు వంటివి ఎదుర్కొంటారు. 
 
వృషభం :  చిన్నచిన్న విషయాల్లో ఉద్రేకం మాని ఓర్పు, విజ్ఞతతో వ్యవహరించాల్సి వుంటుంది. ఎవరికైనా ధన సహాయం చేసినా తిరిగిరాజాలదు. కొత్త ప్రాజెక్టులు చేపడతారు. కళ్లు, నడుము, నరాలకు సంబంధించి చికాకులను ఎదుర్కొంటారు. కొబ్బరి, పండ్ల, పూల, కూరగాయల వ్యాపారులకు పురోభివృద్ధి.
 
మిథునం :  వ్యాపారాల అభివృద్ధికి కొత్త మార్గాలు అన్వేషిస్తారు. పత్రిక, ప్రైవేట్ సంస్థల్లోని వారికి మార్పులు అనుకూలిస్తాయి. స్త్రీల ఆరోగ్యం కుదుటపడుతుంది. విద్యారంగంలోని వారికి నూతన ఉత్సాహం, పురోభివృద్ధి. మీ వాహనం ఇతురులకిచ్చే విషయంలో లౌక్యంగా వ్యవహరించండి. ఉపాధ్యాయులకు మార్పులు అనుకూలిస్తాయి.
 
కర్కాటకం : విద్యుత్, ఏసీ కూలర్లు, మెకానికల్ రంగాల్లో వారికి సంతృప్తి కానవస్తుంది. స్త్రీలకు స్వీయ ఆర్జన పట్ల ఆసక్తి, తగు ప్రోత్సాహం లభిస్తాయి. స్థిరాస్తిని అమ్మడానికి చేసే యత్నాలు ఫలిస్తాయి. రాతకోతలు, ప్రయాణాలు లాభించకపోవచ్చు. వ్యాపార విషయాల్లో ఏకాగ్రత అవసరం. ఎదుటివారితో మితంగా సంభాషించడం మంచిది.
 
సింహం : దైవ, సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటారు. కార్యసాధనలో పట్టుదలతో వ్యవహరించి సత్ఫలితాలు పొందుతారు. ఉద్యోగస్తుల సమర్థత, చాకచక్యానికి అధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి. ప్రైవేట్ సంస్థల్లో వారికి తోటివారి కారణంగా సమస్యలు తలెత్తగలవు. పెద్దల ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. 
 
కన్య : సిమెంట్, కలప, ఐరన్, ఇటుక వ్యాపారులకు లాభదాయకం. ఆకస్మికంగా ప్రయాణాల్లో వస్తువుల పట్ల జాగ్రత్త అవసరం. కోర్టు వ్యవహారాలు వాయిదా పడతాయి. రావలసిన ధనం రావడంతో మీ ఆలోచనలు పలు విధాలుగా ఉంటాయి. స్థిరాస్తులు, వ్యవహారాలు, వాణిజ్య ఒప్పందాలు మీకు అనుకూలిస్తాయి. 
 
తుల : వ్యాపార వర్గాల వారి మాటతీరు, స్కీములు కొనుగోలుదార్లను ఆకట్టుకుంటాయి. మీ సంతానం కోసం ధనం అధికంగా వెచ్చిస్తారు. విందులు, వినోదాలు, సమావేశాల్లో చురుకుగా వ్యవహరిస్తారు. ఎదుటివారితో ఎలా మాట్లాడినా తప్పుగానే భావిస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. సద్వినియోగం చేసుకోండి.
 
వృశ్చికం : ఒక్కోసారి మీ జీవిత భాగస్వామి మనస్తత్వం అర్థం చేసుకోవడం కష్టమవుతుంది. దూర ప్రయాణాల్లో ఇబ్బందులు తలెత్తుతాయి. భాగస్వామిక ఒప్పందాల్లో మీ నిర్ణయాన్ని కచ్చితంగా తెలియజేయండి. మీ హద్దులో మీరు ఉండటం అన్ని విధాలా క్షేమదాయకం. మీ శ్రీమతి సూటిపోటి మాటలు మీకు అసహనం కలిగిస్తాయి. 
 
ధనుస్సు: ఉద్యోగ యత్నంలో నిరుద్యోగులకు బిడియం, అభిమానం కూడదు. ఒక కార్యం నిమిత్తం ఆకస్మికంగా ప్రయాణం చేస్తారు. ప్రముఖులను కలుసుకుంటారు. అందివచ్చిన అవకాశం చేజారినా ఒకందుకు మంచిదే. పాత వస్తువులను కొని ఇబ్బందులను ఎదుర్కొంటారు. కానివేళలో ఇతరుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. 
 
మకరం : రిప్రసెంటేటివ్‌లు తమ టార్గెట్లను అతికష్టంమ్మీద పూర్తి చేస్తారు. మీ అభిరుచికి తగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. ప్రదేశ సందర్శనలు, తీర్థయాత్రలు అనుకూలిస్తాయి. కోర్టు, ఆస్తి వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. షాపుల మార్పుతో వ్యాపారాలు ఊపందుకుంటాయి. అద్దె ఇంటి కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. 
 
కుంభం : కాంట్రాక్టర్లు చేపట్టిన పనులు ఏమంత సంతృప్తినివ్వజాలవు. స్త్రీలకు అధిక శ్రమ, ఆందోళన వల్ల ఆరోగ్యం మందగిస్తుంది. రాజకీయ రంగాల వారికి ప్రభుత్వ పిలుపు అందుతుంది. మీ కళత్ర మొండివైఖరి నిరుత్సాహం కలిగిస్తుంది. బంధువుల రాకతో గృహంలో సందడి కానవస్తుంది. కార్యసాధనలో లక్ష్యాలు సాధిస్తారు.
 
మీనం : ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి ఒత్తిడి, చికాకులను ఎదుర్కొంటారు. ప్రణాళికాబద్ధంగా పనిచేసి సత్ఫలితాలను పొందుతారు. విద్యార్థినులకు ప్రేమ వ్యవహారాల్లో ఒత్తిడి, చికాకులను ఎదుర్కొంటారు. మీ ఉత్సాహాన్ని అదుపులో ఉంచుకోవటం శ్రేయస్కరం. ఎప్పటి సమస్యలను అప్పుడు పరిష్కరించుకోవడం శ్రేయస్కరం.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

గోవిందుని రథోత్సవం.. వేలాదిగా తరలివచ్చిన భక్త జనం