శ్రావణ మాసం ప్రారంభం కానుంది. శ్రావణ సోమవారం శివయ్యను స్మరించుకోవాలి. ఈ రోజున శివయ్య అభిషేకం చేయించాలి. ఎందుకంటే శివయ్యను అభిషేక ప్రియుడు అంటారు. దీంతో పాటు శ్రావణ మాసంలో రుద్రాభిషేకం చేస్తే శివుడిని ప్రసన్నం చేసుకోవచ్చని విశ్వాసం. శ్రావణ మాసంలోని సోమవారం రోజున ఈశ్వరుడిని ఆరాధిస్తూ, ఉపవాస దీక్షను ఆచరిస్తూ అభిషేకాలు చేయడం వల్ల తమ కోరికలన్నీ నెరవేరుతాయి.
ఇంకా శ్రావణ సోమవారాల్లో మహాదేవుడికి ఏయే వస్తువులు సమర్పించాలనేది చూద్దాం.. శ్రావణ సోమవారం రోజున ఏదైనా తీర్థయాత్ర లేదా గంగా నది నుంచి తెచ్చిన నీటితో శివ లింగానికి జలాభిషేకం చేయాలి. ఇలా చేసిన వ్యక్తులకు కచ్చితంగా మోక్షం లభిస్తుంది.
శ్రావణ మాసంలో సోమవారం రోజున శివయ్యకు స్వచ్ఛమైన ఆవు నెయ్యిని నైవేద్యంగా సమర్పించాలి. ఇలా చేయడం వల్ల మీకు ఆదాయం పెరుగుతుంది.