Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కుడిచేతికి ఆ భాగంలో మచ్చ ఉన్నచో..?

Advertiesment
కుడిచేతికి ఆ భాగంలో మచ్చ ఉన్నచో..?
, శనివారం, 24 నవంబరు 2018 (13:52 IST)
పుట్టుమచ్చ లేని వారుండరు. చాలామందికి ఎక్కడ చూసినా విపరీతంగా పుట్టుమచ్చలు ఏర్పడుతుంటాయి. కొందరికి మచ్చలంటే చాలా ఇష్టం. మరికొందరి ఈ మచ్చలు ఎక్కువగా వస్తున్నాయని వారిని తొలగిస్తారు. అలా తొలగిస్తే ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుందని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు. కనుక జాగ్రత్త వహించండి. పుట్టుమచ్చల శాస్త్రం ప్రకారం అరచేతిలో మచ్చ ఉంటే.. కలిగే ప్రయోజనాలు తెలుసుకుందాం..
 
అరచేతియందు పుట్టుమచ్చ ఉన్నచో వారికి విశేషమైన సంపదలు కలుగుతాయి. కుడి అరచేతిమీద బొటనవ్రేలి క్రింద పుట్టుమచ్చ ఉన్నచో వారు విశ్వాసపాత్రుడవుతారు. ధనానికి లోటుండదు. అంతేకాకుండా ఇతరుల అధికారానికి లోబడియుంటారు. కుడి అరిచేతి చిటికెన వ్రేలి యందు మచ్చ ఉన్నచో.. వారు ధనవంతుడవుతాడు. లౌకిక వ్యవహారాలలో నేర్పరియైయుంటారు. 
 
కుడి అరచేతి చూపుడు వ్రేలులో మచ్చ ఉంటే.. వారు మంచి వ్యవహార జ్ఞానం, మాట నేర్పరితనము, ఒంటరిగా నుండుటయు, మాటలచే ధనార్జనశక్తియు, పైకి ప్రేమతో మాట్లాడు స్వభావం కలిగియుంటారు. చేతిమండమీద మచ్చగలవారు కుటుంబ వృద్ధి కలవాడును, సౌఖ్యముగ జీవించువాడునునై యుండును.  

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

గృహ నిర్మాణం ఇలా చేస్తే..?