Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ధన వృద్ధికి ఈ చిన్నపని చేస్తే చాలు...

ఒక శుభదినం, శుభ ముహుర్తంలో చింతచెట్టు దగ్గరకు వెళ్లి దానిని ఆహ్వానించాలి. ఒక తమలపాకుపై రెండు మిరియాలు, రెండు లవంగాలు, ఒక మిఠాయి, దీపం, రెండు అగరుబత్తీలు, రూపాయి పావలా వుంచి, రేపు మిమ్మల్ని తీసుకెళ్లటానికి వస్తాను అని చెట్టుతో చెప్పాలి. మరునాడు వెళ్ల

ధన వృద్ధికి ఈ చిన్నపని చేస్తే చాలు...
, శుక్రవారం, 16 ఫిబ్రవరి 2018 (22:47 IST)
ఒక శుభదినం, శుభ ముహుర్తంలో చింతచెట్టు దగ్గరకు వెళ్లి  దానిని ఆహ్వానించాలి. ఒక తమలపాకుపై రెండు మిరియాలు, రెండు లవంగాలు, ఒక మిఠాయి, దీపం, రెండు అగరుబత్తీలు, రూపాయి పావలా వుంచి, రేపు మిమ్మల్ని తీసుకెళ్లటానికి వస్తాను అని చెట్టుతో చెప్పాలి. మరునాడు వెళ్లి, లేతగా వున్న ఒక రెమ్మ తీసుకువచ్చి ధూపదీపాలతో పూజించి, నగదు పెట్టెలో ఉంచాలి. ఇంట్లో ధనలాభం పెరుగుతుంది.
 
2. ఇంట్లో ప్రశాంత వాతావరణం నెలకొనాలంటే - వంటగదిలోని పొయ్యిపై మొదటి రొట్టెను నేతితో కాల్చి, నాలుగు భాగాలు చేసి, ఆవుకు, నల్లకుక్కకు కాకికి వేసి, నాలుగో భాగాన్ని నాలుగు వీధుల కూడలిలో ఉంచాలి. ఇంట్లో సుఖశాంతులు స్థిరమవుతాయి. 
 
3. కుమారుడు సత్ర్పవర్తన కావటానికి కన్నతల్లి తన పాపిటలో సింధూరం ధరించి, అదే సింధూరాన్ని తన కొడుకు నుదుట తిలకంగా పెట్టాలి. తల్లి చెప్పే మంచి మాటను కుమారుడు జవదాటడు.
 
4. ఒత్తిడి తగ్గటానికి- శుక్లపక్షంలోని మొదటి శనివారం పచ్చి పాలలో చక్కెర కలిపి నేరేడు చెట్టు మొదట్లో అర్పించి, ఆ తడి మట్టిని తిలకంగా ధరించాలి. పచ్చిపాలు రుద్దుకొని స్నానం చేయాలి. ప్రతి అమవాస్య నాడు పెద్దల పేరుతో  పరమాన్నం ఆలయంలో దానం చేయాలి. వెండి పాత్రలు ఉపయోగించాలి. ఇలా చేస్తే లాభం ఉంటుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆ ఆలయంలోకి వెళ్లాలంటే.. పురుషులకు చీరకట్టు, లిప్‌స్టిక్‌ తప్పనిసరి..