Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

2017లో తులా రాశి వారి ఫలితాలు ఇలా ఉన్నాయి....

తులా రాశివారు సెప్టెంబర్ 12వ తేదీ వరకు వ్యయము నందు బృహస్పతి, ఆ తదుపరి అంతా జన్మమము నందు, జూన్ నెల వరకు తృతీయము నందు శని, ఆ తదుపరి వక్రగతిన ద్వితీయము నందు, అక్టోబర్ నుంచి తృతీయము నందు, ఆగస్టు నెల వరకు పంచమము నందు కేతువు, లాభము నందు రాహువు, ఆ తదుపరి అ

Advertiesment
Horoscope 2017 Predictions
, గురువారం, 29 డిశెంబరు 2016 (20:14 IST)
తులారాశి : చిత్త 3, 4 పాదములు, స్వాతి 1,2, 3, 4 పాదములు, విశాఖ 1, 2, 3 పాదములు 
ఆదాయం -14 వ్యయం-11 పూజ్యత- 6 అవమానం-1
 
తులా రాశివారు సెప్టెంబర్ 12వ తేదీ వరకు వ్యయము నందు బృహస్పతి, ఆ తదుపరి అంతా జన్మమము నందు, జూన్ నెల వరకు తృతీయము నందు శని, ఆ తదుపరి వక్రగతిన ద్వితీయము నందు, అక్టోబర్ నుంచి తృతీయము నందు, ఆగస్టు నెల వరకు పంచమము నందు కేతువు, లాభము నందు రాహువు, ఆ తదుపరి అంతా చతుర్థము నందు కేతువు, రాజ్యము నందు రాహువు సంచరిస్తారు. 
 
ఈ రాశివారి గోచారం పరీక్షించగా ''శాంతంబయిన సఫలమౌ సకల కార్యంబుల్'' అన్నట్లు కార్యసాధనలో ఓర్పు, విజ్ఞతతో వ్యవహరించవలసి ఉంటుంది. ధనాభివృద్ధి కానవచ్చినా ఏ మాత్రం ధనం నిల్వ చేయలేదు. కుటుంబీకుల మధ్య సంబంధబాంధవ్యాలు మెరుగవుతాయి. తలపెట్టిన శుభకార్య యత్నాలు నిర్విఘ్నంగా పూర్తిచేస్తారు. బంధుమిత్రులతో ఆదరణ పెరుగుతుంది. మీరంటే ఒక ప్రత్యేకాభిమానం ఏర్పడుతుంది. తల, కాళ్లు, నడుము, నరాలకు సంబంధించిన చికాకులు అధికం అవుతాయి. ప్రైవేట్ సంస్థల్లో వారికి పనిఒత్తిడి, భారం అధికమవుతుంది. తోటివారితో లౌక్యంగా వ్యవహరించి పనులు చక్కపెట్టుకోవడం మంచిది. వ్యాపార విస్తరణ యత్నాలలో సఫలీకృతులవుతారు. నూతన విద్యారంగాల్లో వారికి నూతన ఆలోచనలు స్ఫురిస్తాయి. 
 
విద్యార్థుల్లో పోటీతత్వం అధికమవుతుంది. ఇనుము, సిమెంట్, కలప రంగాల్లో వారికి కలిసి వచ్చే కాలం. స్త్రీలు ఓర్పు, నేర్పుతో ముందుకు సాగవలసి ఉంటుంది. విద్యార్థులు అనుకున్న లక్ష్యాలు సాధించేందుకు అధిక శ్రమ అవసరం. నిర్మాణ రంగాల్లో వారికి పనివారితో మెళకువ అవసరం. వ్యవసాయ రంగాల్లో వారికి వాతావరణం అనుకూలించకపోవడంతో ఆందోళన తప్పదు. ఆడిటర్లకు పనిఒత్తిడి అధికం అయినా సత్ఫలితాలు పొందుతారు. ఏజెంట్లకు, బ్రోకర్లకు, వైద్య రంగాల్లో వారికి పురోభివృద్ధి, ప్రయాణాల్లో మెళకువ వహించండి. నిరుద్యోగులు ఊహించని అవకాశాలు లభిస్తాయి. వారు పొందిన అవకాశాలను సద్వినియోగం చేసుకోగలుగుతారు. ఆధ్యాత్మిక చింతన పెంపొందుతుంది. దైవ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. 
 
కిరాణ, ఫ్యాన్సీ, వస్త్ర, బంగారు వ్యాపారస్తులకు శ్రమాధిక్యత ఉన్నప్పటికీ అనుకూల ఫలితాలు లభిస్తాయి. న్యాయసంబంధమై విషయాల్లో ఒక స్థిరనిర్ణయానికి రాగలుగుతారు. స్థిరాస్తి అభివృద్ధి లేదా కొనుగోలు దిశగా మీ ఆలోచనలుంటాయి. అధికయత్నం చేసి సఫలీకృతులు కండి. భాగస్వామ్య వ్యాపారుల్లో పరస్పర అవగాహన లోపం ఏర్పడే అవకాశం ఉంది. సాహిత్య, కళారంగాల్లో వారికి నూతన అవకాశాలు లభిస్తాయి. రాజకీయాల్లో వారు ఎత్తుకు పై ఎత్తు వేసి ప్రత్యర్థులను ఓడించ గలుగుతారు. వాణిజ్య రంగాల్లో వారికి మిశ్రమ ఫలితం. అవివాహితులకు కోరుకున్న సంబంధాలు నిశ్చయం కాగలవు. విదేశీయాన యత్నాల్లో సఫలీకృతులవుతారు. ముఖ్యులకు బహుమతులు అందజేస్తారు. 
 
* అక్టోబర్ వరకు ఏలినాటి శనిదోషం ఉన్నందువల్ల ప్రతి శనివారం 20సార్లు నవగ్రహ ప్రదక్షణ చేసిన సర్వదా శుభం కలుగుతుంది. 
* ఈ రాశివారు హనుమాన్ చాలిసా పఠించడం వల్ల, లక్ష్మీ నారాయణుని ఆరాధించడం వల్ల ఆర్థికాభివృద్ధి, పురోభివృద్ధి, ఆరోగ్యాభివృద్ధి చేకూరుతుంది. 
* చిత్తనక్షత్రం వారు జాతి పగడం, స్వాతి నక్షత్రం వారు ఎర్రగోమేధికం, విశాఖనక్షత్రం వారు వైక్రాంతమణి ధరించిన పురోభివృద్ధి పొందుతారు. 
* చిత్తా నక్షత్రం వారు తాటిచెట్టును, స్వాతి నక్షత్రం వారు మద్ది చెట్టును, విశాఖ నక్షత్రం వారు మొగలి చెట్టును దేవాలయాలలో కానీ విద్యా సంస్థల్లో కానీ, ఖాళీ ప్రదేశాలలో నాటినట్లైతే అభివృద్ధి కానవస్తుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కన్యా రాశి ఫలితాలు... 2017లో ఎలా ఉంది?