Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రాహు - కేతు దోషాలకు ఈ చిట్కాలే విరుగుడు..

Advertiesment
rahu kalam
, బుధవారం, 21 జూన్ 2023 (11:01 IST)
రాహు - కేతు దోషాలకు నివృత్తి కలగాలంటే ఈ చిట్కాలు పాటించాల్సిందే. రాహు కాలంలో పుట్ట పాలుకు పాలు పోయడం, కోడిగుడ్డు వేయడం చేయాలి. పుట్టకు పూజ చేయడం ద్వారా సర్పదోషాన్ని తొలగించుకోవచ్చు. ఇంకా పుణ్యఫలం సిద్ధిస్తుంది. 
 
అలాగే గోమేధికాన్ని ఉంగరంగా ధరించవచ్చు. ఇది రాహువు అశుభ ప్రభావాలను తగ్గిస్తుంది. అలాగే మినపప్పు గారెలు రాహుకు సమర్పించడం ద్వారా దోషాలు తొలగిపోతాయి. మినపప్పు వడలను దానం చేయడం మంచిది. 
 
రాహు కేతు దోషాలున్న వారు, రావిచెట్టు, వేప చెట్టు కలిసి వున్న ప్రాంతంలో ప్రదక్షిణలు చేయడం మంచిది. ఇది మంగళవారం నాడు చేస్తే మంచిది. ఇలా 48 రోజులు చేయాలి. భద్రకాళి రాహువుకు అధిదేవత. ఉత్తరాభిముఖంగా ఉన్న అన్ని దేవాలయాలలో దుర్గమ్మ ఉంటుంది. ప్రతి శుక్రవారం నిమ్మతొక్కపై దీపం వెలిగించి ఆ అమ్మవారిని ప్రార్థిస్తే సకల దోషాలు తొలగిపోతాయి. 
 
దుర్గాసూక్త మంత్రాలను పఠిస్తూ పుష్పాలతో, ఉసిరి వంటి నల్ల ధాన్యాలు, పులుపు పండ్లతో హోమములు చేస్తే.. జాతకంలోని రాహు కేతు దోషాలు తొలగిపోతాయి. జీవితంలో శత్రువులను సంహరించే పరాక్రమం లభిస్తుంది. 
 
అలాగే పెద్ద కాంచీపురంలోని శ్రీ ఆనంద పద్మేశ్వర దేవాలయం (లింగప్పన్ వీధి, ఏకాంబరనాథర్ దేవాలయం సమీపంలో) వద్ద రాహువును పువ్వులతో అర్చించి వేప నూనె దీపం వెలిగిస్తే యోగాన్ని అందిస్తాడు. దోషాలను తొలగిస్తాడు.  
 
అనాథలు, నిరాశ్రయులైన పిల్లలకు స్వీట్లు అందించడం ద్వారా రాహు-కేతు దోషాలు తొలగిపోతాయి. 
 
శివ పంచాక్షర మంత్రాన్ని "ఓం నమః శివాయ" అని ప్రతిరోజూ 108 సార్లు జపించాలి. శివలింగానికి బిల్వపత్రాలు సమర్పించాలి. ఇంకా అభిషేకానికి, పచ్చి పాలు, పండ్లు, నీరు అందించాలి.  

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆషాఢ పౌర్ణమి నాడు మహాశివుడు రుషులకు సత్యాన్ని..?