Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

హేవళంబితో అన్నీ శుభాలే... నువ్వులు దానం చేయండి.. శ్రీవారిని పూజించండి..

ఉగాది రోజున పంచాంగ శ్రవణం వినడం సంప్రదాయం. ఈ ఏడాది ఉగాది హేవళంబి నామ సంవత్సరానికి స్వాగతం పలికింది. ఈ సంవత్సరం దుర్ముఖి నామ సంవత్సరంలా కాకుండా.. హేవళంబిగా శుభఫలితాలను ప్రసాదిస్తుందని పంచాంగ నిపుణులు త

హేవళంబితో అన్నీ శుభాలే... నువ్వులు దానం చేయండి.. శ్రీవారిని పూజించండి..
, బుధవారం, 29 మార్చి 2017 (12:42 IST)
ఉగాది రోజున పంచాంగ శ్రవణం వినడం సంప్రదాయం. ఈ ఏడాది ఉగాది హేవళంబి నామ సంవత్సరానికి స్వాగతం పలికింది. ఈ సంవత్సరం దుర్ముఖి నామ సంవత్సరంలా కాకుండా.. హేవళంబిగా శుభఫలితాలను ప్రసాదిస్తుందని పంచాంగ నిపుణులు తెలిపారు. సంవత్సరాల్లో 31వది అయిన హేవళంబి సంవత్సరానికి అగ్నిదేవుడు అధిపతిగా వ్యవహరిస్తాడు. అగ్నిదేవుని కృప ద్వారా ఈ ఏడాది ఏ పనిచేసినా విజయవంతం అవుతుంది. వర్షాలు కురుస్తాయి. పంటలు పండుతాయి. 
 
బుధుడు ఈ ఏడాదికి రాజుగా వ్యవహరించడం ద్వారా రైతన్న కష్టాలు తీరిపోతాయి. రైతులకు గిట్టుబాటు ధరలు లభిస్తాయి. అలాగే ఈ ఏడాదికి మంత్రిగా శుక్రుడు వ్యవహరించడం ద్వారా సర్కారు అద్భుతంగా పనిచేస్తుందని పంచాంగ నిపుణులు అంటున్నారు. పంటలకు తగిన వర్షాలు, ఒకవేళ వర్షాలు తగ్గినా మాగాణి, మెట్ట పంటలు చక్కగా సాగుబడిని ఇస్తాయని పండితులు చెప్తున్నారు. ఇక ధాన్యాధిపతి శని కావడంతో... మినుములు, నువ్వులు బాగా పండుతాయి. 
 
హేవళంబి సంవత్సరానికి కుజుడు రసాధిపతి కావడంతో బెల్లం, జీలకర్ర పంటలకు ఢోకా ఉండదు. గిట్టుబాటు ధర లభిస్తుంది. ఇంకా ఈ ఏడాదిన సూర్యభగవానుని దశ నడవడంతో బంగారం, వెండి ఇతరత్రా లోహాలను కొనేందుకు సానుకూలంగా ఉంటుంది. తొమ్మిది గ్రహాల్లో ఈ ఏడాదికి ఆరు శుభ గ్రహాలు కావడంతో.. ఏపీకి శుభఫలితాలుంటాయి. దేశానికి కూడా శుభ ఫలితాలు చేకూరుతాయని పంచాంగ నిపుణులు అంటున్నారు.
 
ఇక హేవళంబికి అగ్నిదేవుడు అధిపతి కావడంతో నువ్వుల దానం చేయడం ద్వారా సకల దోషాలు తొలగిపోతాయి. లేదంటే నువ్వుల ఉండల్ని ఆవులకు పెడితే ఇబ్బందులు తొలగిపోతాయి. ఇంకా కలియుగ వైకుంఠం తిరుమలలో వెలసిన శ్రీ వెంకటేశ్వరస్వామికి విశేషమైన సేవలు, పూజలు జరపడం ద్వారా ఈ ఏడాది శుభ ఫలితాలను పొందవచ్చునని పండితులు సూచిస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శ్రీవారి ఆలయంలో ఉగాది ఆస్థానం.. అల్లుడైన కడప వెంకన్నను దర్శించుకున్న ముస్లింలు